వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ నేర్చుకొని, ఈసారి మాట్లాడుతా: తెలుగు కోడలు నిర్మలా

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈసారి వచ్చినప్పుడు మీడియాతో కన్నడలో మాట్లాడుతానని చెప్పారు.

గతంలో ఆమె ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఈసారి కర్నాటక నుంచి ఆమె రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కన్నడలోనే ప్రశ్న అడగాలని, తనకు కన్నడ అర్థమవుతుందని మీడియాతో మాట్లాడి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Nirmala Sitharaman

తనకు కన్నడ పూర్తిగా అర్థమవుతుందని చెప్పారు. కానీ మాట్లాడలేనని తెలిపారు. కన్నడ నేర్చుకొని, వచ్చేసారి మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని కన్నడలోనే నిర్వహిస్తానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన సేవకులు అని, ఆన సూచన మేరకు కర్నాటక సేవకు ముందుకొచ్చానని ఆమె తెలిపారు. కాగా, నిర్మల తెలుగు కోడలు అయిన విషయం తెలిసిందే.

English summary
I will learn Kannada and protect State's interests, says Nirmala Sitharaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X