వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలోకి నో: పనబాక, కిరణ్ చెప్పినా వినను: పంతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Panabaka Laxmi
హైదరాబాద్: తాను భారతీయ జనతా పార్టీలో చేరుతానని, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి గురువారం బాపట్లలో మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ వల్లనే తాను ఈ స్థాయికి వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసును వీడనని, 2014 ఎన్నికల్లో బాపట్ల నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కోరితే రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, పనబాక లక్ష్మిని పలువురు సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో పనబాక వర్గీయులు ఎదురు దాడికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తతత ఏర్పడింది.

సిఎం చెప్పినా వినను: పంతం గాంధీ

తాను రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయనని ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినా తాను వినేది లేదన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇంకా సమైక్యానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు.

కోరితే సంతకం చేశా: తుని ఎమ్మెల్యే

మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి కోరితే తాను సంతకం చేశానని కానీ, రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం ఎవరి పేరు చెబితే వారికే ఓటేస్తానని తుని ఎమ్మెల్యే అన్నారు.

సోనియా ఆత్మహత్య చేసుకునే వారు: కెఈ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలుగు వచ్చి ఉంటే సీమాంధ్రులు పెట్టిన శాపనార్థాలు విని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వారని తెలుగుదేశం పార్టీ నేత కెఈ అన్నారు. కొత్త రాజధానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుండి వస్తాయో చెప్పాలని ప్రశ్నించారు.

English summary
Union Minister Panabaka Laxmi on Thursday said she will not quit Congress and condmned the rumors joinig BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X