వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్‌పై రెచ్చిన పోసాని: నంది అవార్డు తీసుకోను, కెసిఆర్‌ను చూసి, విమర్శించొద్దా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Posani Krishna Murali Fires On Nara Lokesh : Controversial Comments | Oneindia Telugu

హైదరాబాద్: టెంపర్ సినిమాకు తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రకటించారు. నంది అవార్డులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. నంది అవార్డులపై ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు చెందిన కొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడ ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. అయితే మంత్రి లోకేష్ చేసిన విమర్శలపై తాజాగా పోసాని కృష్ణ మురళి సీరియస్ అయ్యారు.

కులాన్ని అంటగడుతారా, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే, జ్యూరీ నిర్ణయమే: బాబు సంచలనంకులాన్ని అంటగడుతారా, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే, జ్యూరీ నిర్ణయమే: బాబు సంచలనం

ఏపీ ప్రభుత్వం మూడేళ్ళకు నంది అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల విషయమై విమర్శలు ప్రారంభమయ్యాయి. రుద్రమదేవి సినిమాకు అవార్డు రాకపోవడం పట్ల ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుణశేఖర్‌కు తోడుగా మరికొందరు కూడ ఇదే బాటలో పయనించారు.

హైద్రాబాద్‌లో కూర్చొని విమర్శలా, ఏపీలో ఆధార్, ఓటరు కార్డుల్లేవ్: లోకేష్ సంచలనంహైద్రాబాద్‌లో కూర్చొని విమర్శలా, ఏపీలో ఆధార్, ఓటరు కార్డుల్లేవ్: లోకేష్ సంచలనం

ఈ పరిణామాలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ వేర్వేరుగా స్పందించారు. అయితే జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ప్రకారంగానే అవార్డులను ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

 తెలుగు రోహింగ్యాలను చేశారు

తెలుగు రోహింగ్యాలను చేశారు

ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శలు చేస్తున్నారంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ వ్యాఖ్యలతో తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏమిటని ఆయన ప్రశ్నించారు.

నంది అవార్డులు లోకేష్ సొత్తా

నంది అవార్డులు లోకేష్ సొత్తా

నంది అవార్డులు నీ అబ్బ సొత్తా అంటూ లోకేష్‌ను ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. విమర్శలు చేస్తే స్థానికేతరులు అవుతారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా?. 2014 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా? అంటూ లోకేష్‌పై పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 హైద్రాబాద్‌లో ట్యాక్స్‌లు కట్టేవారిని జ్యూరీలోకి ఎలా?

హైద్రాబాద్‌లో ట్యాక్స్‌లు కట్టేవారిని జ్యూరీలోకి ఎలా?

ఇక్కడే ట్యాక్స్ లు కడుతున్నారు కదా మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు?. రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదు. భారత రత్న, పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి అవి తీసేశారా? అని సూటిగా ప్రశ్నలు సంధించారు.

నంది అవార్డును తీసుకోను

నంది అవార్డును తీసుకోను

టెంపర్ సినిమాకు తనకు వచ్చిన అవార్డును తీసుకోననని ఆయన ప్రకటించారు. ఈ అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా.. అవార్డు తీసుకుంటే పోసాని ఫలానా సామాజికవర్గమైనందునే ఆయనకు అవార్డు వచ్చిందంటారు..అందుకే ఈ అవార్డును తీసుకోనని ప్రకటించారు. అంతేకాదు ఈ అవార్డులను రద్దు చేయాలని ఆయన చంద్రబాబునాయుడును కోరారు. చంద్రబాబు చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ పద్దతిలో మరోసారి విజేతలను ఎంపిక చేయాలని అని పోసాని కోరారు.

 కెసిఆర్‌ను చూసి నేర్చుకోండి

కెసిఆర్‌ను చూసి నేర్చుకోండి

హైద్రాబాద్‌లో ట్యాక్స్ కడితే ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయకూడదా అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు కుటుంబం కూడ హైద్రాబాద్‌లో ట్యాక్స్‌లు కట్టడం లేదా అని ఆయన ప్రశ్నించారు.హైద్రాబాద్‌లో ఇళ్ళు కట్టుకొని ఏపీలో ఎలా రాజకీయం చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని పోసాని కృష్ణమురళి సూచించారు.

English summary
Tollywood writer and actor Posani Krishna murali made allegations on Andhra pradesh IT minister Nara Lokesh on Tuesday. Posani Krishnamurali responded on minister Nara Lokesh allegations. He said that I will not take Nandi award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X