వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటపెడ్తా: జగన్‌పై డిఎల్, బాబు వైపు, టిడిపిలోకి తోట

By Srinivas
|
Google Oneindia TeluguNews

I will reveal deal between YSRCP and Congress: DL
హైదరాబాద్/కడప: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య గల అనుబంధాన్ని తాను బయటపెడతానని మాజీ మంత్రి, కడప జిల్లా సీనియర్ నేత డిఎల్ రవీంద్రా రెడ్డి శుక్రవారం హెచ్చరించారు. ఆయన ఉదయం మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ క్రమంగా పడిపోయిందన్నారు.

అదే సమయంలో సీమాంధ్రలో టిడిపికి ఆదరణ పెరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో జగన్ కూడా భాగస్వామి అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. కడపలోని ప్రజాగర్జన సమయంలో తాను టిడిపిలో చేరుతానని చెప్పారు. డిఎల్ ఉదయం చంద్రబాబును కలిశారు.

టిడిపిలోకి తోట

మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తోట నర్సింహం శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో నాయకుడు చిట్టూరి రవీంద్ర కూడా చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో పలువురు కాంగ్రెసు నేతలు టిడిపిలో చేరుతున్న విషయం తెలిసిందే.

కక్ష కట్టారన్న కావూరి

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించినందుకు, తనపై కక్షగట్టారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు ఆరోపించారు. అందువల్లే తన సంస్థ ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ను తెరమీదకు తీసుకొచ్చారని అన్నారు. ఈ విషయంపై మాట్లాడటానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని, తాము ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు.

English summary
Former Minister DL Ravindra Reddy on Friday met TDP chief Nara Chandrababu Naidu and said he will reveal deal between YSRCP and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X