వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా టూర్ క్యాన్సిల్ చేసేవాడినే...కానీ మీ అందరినీ నిరాశపర్చడం ఇష్టంలేక!:సిఎం చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపడం అమానుషమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Recommended Video

ఐక్యరాజ్యసమితి సదస్సులో...తెలుగులో చంద్రబాబు తొలిపలుకులు

"ఈ పరిస్థితుల్లో మామూలుగా అయితే అమెరికా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకునేవాడిని...కానీ మీ అందరినీ నిరాశపరచడంఇష్టంలేక...ఐక్యరాజ్యసమితి వేదికగా రాష్ట్రంలోని ప్రకృతి సేద్యం గురించి వివరించే అవకాశం మళ్లీ రాదన్న ఉద్దేశంతోనే పర్యటనను రద్దు చేయలేదు"...అని చెప్పారు సిఎం చంద్రబాబు. న్యూజెర్సీలో జరిగిన ఎన్నారైల సభలో సిఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు.

I would cancel my America tour...but...!:AP CM Chandra Babu

ఎన్నారైల సభ ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన కిడారి, సోమతో పాటు కొద్దిరోజుల క్రితం రోడ్డుప్రమాదంలో మరణించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణకు కూడా నివాళులు అర్పించి, అనంతరం ప్రసంగం ప్రారంభించారు.

దాడి కాదు...ఆ ఎమ్మెల్యేలకు ఎరవేసి చంపేశారట:ఈ వ్యూహం పేరే 'బెయిటెడ్‌ అంబుష్‌'దాడి కాదు...ఆ ఎమ్మెల్యేలకు ఎరవేసి చంపేశారట:ఈ వ్యూహం పేరే 'బెయిటెడ్‌ అంబుష్‌'

ఆ తరువాత మావోయిస్టుల చేతుల్లో హతమైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరితో, సోమ భార్య ఇందుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేమని, కుటుంబానికి అండగా ఉంటానని, మీ బిడ్డలకు అన్నివిధాలుగా సాయంగా నిలుస్తానని కిడారి భార్య పరమేశ్వరికి చంద్రబాబు హామీ ఇచ్చారు.

అత్యంత విపత్కరమైన ఈ పరిస్థితుల్లో గుండె దిటవు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సోమ భార్య ఇందును చంద్రబాబు ఓదార్చారు. మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు.. కిడారి, సోమ మృతికి రాష్ట్రప్రభుత్వం సోమ, మంగళవారాలను సంతాప దినాలుగా ప్రకటించింది.

English summary
'In these circumstances, usually I would be cancel my tour...but I do not want you to be disappointed'...said AP CM Chandrababu in NRI's meeting held at Newjersy in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X