వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవిష్యత్‌లో మంత్రిపదవి వస్తుంది... ఎమ్మెల్యే రోజా..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా తాను పని చేశానని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. అంతే మంత్రిపదవుల కోసం కాదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తామంతా కూడ ముఖ్యమంత్రులమని చెప్పారు. ఈనేపథ్యంలోనే మంత్రి పదవి రాకపోవడంపై తాను అసంతృప్తితో ఉన్నానన్న వార్తలను ఆమే కొట్టిపారేశారు. మంత్రి పదవుల కోసం పార్టీలో పని చేయలేదని ఆమే తెలిపారు. అయితే భవిష్యత్‌లో మంత్రి వస్తుందని ఆమే ఆశాభావం వ్యక్తం చేశారు.

అలక వీడిన రోజా...

అలక వీడిన రోజా...


బుధవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరిపారు. ఈనేపథ్యంలోనే వారితో చర్చలు జరిపేందుకు జగన్ నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే తనకు మంత్రి పదవి దక్కపోవడంపై రోజా అలకబూనారు. ఈనేపథ్యంలోనే జగన్‌తో సమావేశం కావాలని నేరుగా విజయసాయిరెడ్డి రోజాకు ఫోన్ చేశారు. దీంతో ఆమే హుటాహుటిన హైదారాబాద్ నుండి జగన్‌తో భేటి అయ్యోందుకు అమరావతికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయింది. అనంతరం ఆమే మీడియాతో మాట్లాడింది..

వైసీపీలో అలకలు, బుజ్జగింపులు ఉండవు..రోజా..

వైసీపీలో అలకలు, బుజ్జగింపులు ఉండవు..రోజా..


ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆమే చెప్పారు.ఇక తన మంత్రిపదవిపై వస్తున్న వార్తలను ఆమే కొట్టి పారేశారు. తనకు మంత్రి పదవి కంటే జగన్ సీఎం అవడమే చాల అనందంగా ఉందని అన్నారు. వైసీపీలో అలకలు, బుజ్జగింపులు ఉండవని.. జగన్ ఇచ్చిన నవరత్నాల హామీల అమలే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.మొత్తం మీద మంత్రిపదవి రాకపోవడంతో అలకభూనిన రోజాతో జగన్ నేరుగా సమావేశం కావడంతో ఆమే పాజీటీవ్‌గానే స్పందించింది

మిగిలిన ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులే..

మిగిలిన ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులే..


కాగా అంతకు ముందు మంత్రి పదవులు ఆశీంచి రాని ఎమ్మెల్యేలకు విజయసాయి రెడ్డితోపాటు ,వైవీ సుబ్బారెడ్డిలు ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం జగన్ సైతం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఈనేపథ్యంలోనే రోజాతోపాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రతాప్‌కుమార్‌ రెడ్డితో సీఎం మాట్లాడారు. అయితే వారికి నామినేటేడ్ పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం.మరోవైపు భవిష్యత్‌లో మంత్రి పదవులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వారితో చెప్పినట్టు తెలుస్తోంది.

సామాజిక సమీకరణల నేపథ్యంలో రోజాకు దక్కని బెర్త్..

సామాజిక సమీకరణల నేపథ్యంలో రోజాకు దక్కని బెర్త్..


కాగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు జగన్ క్యాబినెట్‌లో మంత్రిపదవి లభిస్తుందని రోజా ఆశించింది. జగన్ వెంట ఉండి, అధికార పార్టీపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన రోజాకు మంత్రి పదవి రాకపోవడంతో కొంత నిరుత్సహంగా ఉన్నారు. అయితే జిల్లాలోని సామాజిక సమీకరణల నేపథ్యంలోనే కేబినెట్‌లో స్థానం లభించలేదనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే

English summary
MLA Roja made it clear that she is working for the chief minister Jagan of Andhra pradesh.However, she hope that the minister would come in the future.she met with jagan in the evening
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X