వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: కన్నా లక్ష్మినారయణ

|
Google Oneindia TeluguNews

కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కోన్నారు. గుంటూరులో మీడీయాతో కన్నా మాట్లాడారు.

Recommended Video

దేశ వ్యాప్తంగా మోడీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు కన్నా

ఈ నేపథ్యంలోనే ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణపేదలకు 10 శాతం కేంద్రం కల్పించిన రిజర్వేషన్‌లలో, సామాజికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. వెనకబడిన సామాజిక వర్గాలకోసం రిజర్వేషన్లు కేటాయించవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్లకు సంబంధించి అధికారికంగా మంజునాథ కమిషన్ వేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

I would write the letter to the ap govt on kapu reservations decision :kanna

కాగా టీడీపీ ప్రభుత్వం కాపులకు ప్రత్యేకంగా 5శాతం రిజర్వేషన్ కేటాయించిన నేపథ్యంలోనే నూతనంగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నిర్ణయంపై సమీక్ష చేసింది. ఇందులో బాగంగానే అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లు అన్ని కులాల వారికి చెందుతుతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే..

English summary
Andhra Pradesh state BJP president Laxminarayana opposed the decision of the government on the Kapu reservation.he says it was not the right policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X