వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అక్కకు బ్రెయినెక్కువ, నాకు వాయిసెక్కువ', 'రాజీనామాకు సై, అందుకే వైసీపీని వీడాం'

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఆళ్ళగడ్డ, నంద్యాల ప్రజలు వెంట ఉన్నంత కాలం అమ్మ, నాన్నల ఆశయాలను నెరవేర్చేందుకు కృషిచేస్తామని భూమా సిస్టర్స్ చెప్పారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా నా కుటుంబం నుండి రాజకీయాల్లో ఉన్న వారికి అండదండగా నిలుస్తానని భూమా మౌనిక చెప్పారు.అక్కకు బ్రెయిన్ ఎక్కువ. నాకు వాయిసెక్కువని మౌనిక అన్నారు. ఎమ్మెల్యే పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు సిద్దమని మంత్రి అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏం చేస్తారో అర్ధం కాకే పార్టీ మారామని అఖిలప్రియ చెప్పారు.

నంద్యాల ఎఫెక్ట్: మండలి ఛైర్మెన్ పదవి ఫరూక్‌కేనా, శిల్పా చేజార్చుకొన్నారా?నంద్యాల ఎఫెక్ట్: మండలి ఛైర్మెన్ పదవి ఫరూక్‌కేనా, శిల్పా చేజార్చుకొన్నారా?

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం తథ్యమన్నారు. రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ భూమా కుటుంబమంటే నమ్మకంతోనే ప్రజలు తమను ఆదరిస్తున్నారని భూమా సిస్టర్స్ చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు.

శిల్పాకు బాబు షాక్: ఆ సంస్థ చట్ట విరుద్దం, రుణాలు చెల్లించొద్దుశిల్పాకు బాబు షాక్: ఆ సంస్థ చట్ట విరుద్దం, రుణాలు చెల్లించొద్దు


నంద్యాలలో ప్రజలకు అభివృద్ది కార్యక్రమాలను చేసే సమయంలోనే నాన్న చనిపోవడం తీవ్ర నష్టం కల్గించిందన్నారు. అయితే ప్రస్తుతం నంద్యాలలో జరుగుతున్న ఎన్నికలు రానున్న రోజుల్లో తమకు మంచి అనుభవాన్ని ఇస్తాయన్నారు అఖిలప్రియ.

గంగుల ఎఫెక్ట్: వైసీపీకి షాక్, గోస్పాడుపై పట్టుకు ప్రతాప్‌రెడ్డి వ్యూహంగంగుల ఎఫెక్ట్: వైసీపీకి షాక్, గోస్పాడుపై పట్టుకు ప్రతాప్‌రెడ్డి వ్యూహం

ప్రతి విషయాన్ని ఇంట్లో చర్చించుకొని నిర్ణయం తీసుకొంటామన్నారు భూమా సిస్టర్స్. నాన్న నుండి ఈ విషయాన్ని నేర్చుకొన్నట్టు భూమా సిస్టర్స్ చెప్పారు. అమ్మ, నాన్నలు చూపిన మార్గంలో వారి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని వారు చెప్పారు.ఓ తెలుగు న్యూస్ ఛానల్‌ భూమా అఖిలప్రియ, భూమా మౌనికను ఇంటర్వ్యూ చేశారు.

భూమా కుటుంబానికి ఓటు వేశారు

భూమా కుటుంబానికి ఓటు వేశారు

జగన్ ఏం చేస్తారో తెలియదు. ఆయన చేసే పనులు అర్ధం కావు. నంద్యాలలో ఎందుకు ఇన్ని రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తున్నారో అర్ధం కావడం లేదు. వైసీపీలో ఉన్నంత కాలం ఆయన చేసే పనులు అర్ధమయ్యేవి కావని మంత్రి అఖిలప్రియ చెప్పారు. జగన్ వ్యవహరశైలి నచ్చకనే పార్టీ మారినట్టు అఖిలప్రియ చెప్పారు. రాజీనామా చేయాలని వైసీపీ నేతలు చేసే డిమాండ్ అర్ధం లేదన్నారు. ఆళ్ళగడ్డలో భూమా కుటుంబానికి ఓటు వేశారని అఖిలప్రియ గుర్తుచేశారు. టిడిపిలో తాము చేరిన వెంటనే అందరూ తమ వెంటనే వచ్చారని, ఇంతవరకు ఎవరూ కూడ పార్టీ మారలేదని గుర్తు చేశారు.

Recommended Video

Nandyal By Polls : Balakrishna's act has created headache to Chandrababu Naidu. | Oneindia Telugu
అక్కకు బ్రెయిన్ ఎక్కువ, నాకు వాయిసెక్కువ

అక్కకు బ్రెయిన్ ఎక్కువ, నాకు వాయిసెక్కువ

అక్క అఖిలప్రియకు బ్రెయిన్ ఎక్కువ. నాకు వాయిసెక్కువ అని భూమా మౌనిక చెప్పారు. అమ్మ, నాన్నలు చూపిన దారిలోనే నడుస్తున్నట్టు చెప్పారు. ఆళ్ళగడ్డ, నంద్యాల ప్రజలు అండగా ఉన్నంత కాలం వారికి సేవ చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామన్నారు మౌనిక. పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజలకు సేవ చేయడాన్ని చిన్నప్పటి నుండి నేర్చుకొన్నట్టు మౌనిక చెప్పారు.

రాజకీయాల్లోకి రావాలని ఉన్నా

రాజకీయాల్లోకి రావాలని ఉన్నా

నాన్న చనిపోయిన తర్వాత రాజకీయాల్లో రావాలని ఉంది. అయితే ఈ విషయమై కుటుంబంలో చర్చించిన తర్వాత బ్రహ్మనందరెడ్డిని నంద్యాల నుండి బరిలోకి దింపాలని నిర్ణయించుకొన్నట్టు మౌనిక చెప్పారు.అమ్మ బతికున్న కాలంలో అమ్మ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత నంద్యాలలో నాన్న కోసం కూడ ప్రచారం నిర్వహించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా అన్న, అక్కకు రాజకీయాల్లో సపోర్ట్‌ా ఉంటానని మౌనిక చెప్పారు.అక్కపై ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరైందికాదన్నారు.

2019 ఎన్నికలకు నంద్యాల అనుభవం కలిసివస్తోంది.

2019 ఎన్నికలకు నంద్యాల అనుభవం కలిసివస్తోంది.

2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికల అనుభవం కలిసివస్తోందని మంత్రి అఖిలప్రియ చెప్పారు. ఇప్పటివరకు సానుభూతి పవనాలతో విజయం సాధించినా.... వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ సత్తా ఏమిటో నిరూపించే అవకాశం దక్కుతోందని అఖిలప్రియ చెప్పారు.ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి... ఎలా సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై నంద్యాల ఎన్నికలు మంచి అనుభవాన్ని ఇచ్చాయని అఖిలప్రియ చెప్పారు.

రికార్డుల్లో ఉండేందుకు అసెంబ్లీకి వెళ్ళాను

రికార్డుల్లో ఉండేందుకు అసెంబ్లీకి వెళ్ళాను

నాన్న చనిపోయిన వెంటనే అసెంబ్లీకి వెళ్లడంపై పార్టీ బలవంతంగా అసెంబ్లీకి రప్పించిందని వైసీపీ చేసిన విమర్శలను అఖిలప్రియ ఖండించారు. నాన్న అంత్యక్రియలు పూర్తైన వెంటనే ఇంటికెళ్ళిన తర్వాత తమ వర్గం కార్యకర్తలను ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయమై ఆలోచిస్తున్న సమయంలో బడ్జెట్ సమావేశాన్ని రద్దుచేసి భూమా నాగిరెడ్డి సంతాపసభ ఏర్పాటుచేసిన విషయం సమాచారం రావడంతో తాను అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకొన్నట్టు అఖిలప్రియ చెప్పారు. నాన్న గురించి జరిగే చర్చలో రికార్డు కావాలనే ఉద్దేశ్యంతో తానే అసెంబ్లీకి వచ్చినట్టు చెప్పారు.

 శిల్పా ఏం చేశాడో చెప్పుకోవడానికి లేదు

శిల్పా ఏం చేశాడో చెప్పుకోవడానికి లేదు

నంద్యాలలో మంత్రిగా ఉన్న కాలంలో శిల్పా మోహన్‌రెడ్డి ఏ రకమైన అభివృద్ది చేశాడో చెప్పులేకపోతున్నారు శిల్పా మోహన్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు అఖిలప్రియ. నంద్యాలలో 1500 కోట్లతో అభివృద్ది పనులను నిర్వహిస్తున్నట్టు చెప్పారామె. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ అభివృద్ది టిడిపి హయంలోనే జరిగిందని అఖిలప్రియ చెప్పారు. శిల్పా ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

English summary
Iam ready to resignation for MLA post said Ap minister Bhuma Akhila Priya.No right to ysrcp demand me for resignation. Telugu channel interviewed Bhuma sisters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X