వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అయ్యాక లోకేష్ నుండి మేసేజ్ ల్లేవు, రాజకీయాలపై ఆసక్తి లేకపోవడానికి కారణమదేనా?: బ్రహ్మణి

లోకేష్ మంత్రి కాకముందు మేసేజ్ లతో టచ్ లో ఉండేవారు. మంత్రి అయ్యాక కనీసం మేసేజ్ లు కూడ లేవు. పార్టీ పనులతో పాటు కొత్తగా తీసుకొన్న మంత్రి బాధ్యతల్లో ఆయన బిజీ బిజీగా గడుపుతున్నారని ఆయన ముందు చాల పెద్ద

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: లోకేష్ మంత్రి కాకముందు మేసేజ్ లతో టచ్ లో ఉండేవారు. మంత్రి అయ్యాక కనీసం మేసేజ్ లు కూడ లేవు. పార్టీ పనులతో పాటు కొత్తగా తీసుకొన్న మంత్రి బాధ్యతల్లో ఆయన బిజీ బిజీగా గడుపుతున్నారని ఆయన ముందు చాల పెద్ద గోల్స్ ఉన్నాయని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి చెప్పారు.

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కోడలుగా, మంత్రికి భార్యగా, మరో వైపు కుటుంబ బాధ్యతలను ఏ రకంగా సమర్థంగా నిర్వహిస్తున్నారనే విషయాన్ని బ్రహ్మణి ఎబీఎన్ -ఆంద్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు.

హెరిటేజ్ ఫుడ్స్ లో బాధ్యత తీసుకోవడం అనేది చిన్నవిషయం కాదని తెలుసు.అయితే ఈ బాధ్యతలు తీసుకొనే సమయంలో చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నానని ఆమె చెప్పారు. చిన్నప్పటినుండి ఆరోగ్య రంగమన్నా, పౌష్టికాహారమన్నా చాలా ఆసక్తి ఉండేది.

హెరిటేజ్ విషయానికి వస్తే రైతు, సంక్షేమం అనే ఆలోచనతో స్థాపించారు.ఈ సంస్థను స్థాపించిన 25 ఏళ్ళలో ఏ ఒక్కరోజూ కూడ ఏ రైతుకూ పేమెంట్ ఆలస్యం చేయలేదు. ఆ విలువలతోనే నడుపుతున్నట్టు చెప్పారామె.

అమ్మ వల్లే క్లాస్ లో నెంబర్ వన్ స్టూడెంట్

అమ్మ వల్లే క్లాస్ లో నెంబర్ వన్ స్టూడెంట్

తాను చిన్నప్పటి నుండి క్లాస్ లో నెంబర్ వన్ స్టూడెంట్ ను. అయితే ఈ క్రెడిట్ అంతా అమ్మదే అని బ్రహ్మణి చెప్పారు. నాన్న ఎక్కువ ట్రావెల్ చేసేవారు. సినిమాషూటింగ్ ల్లో బిజీగా ఉండేవారు. దీంతో మా చదువులపై అమ్మ ఎక్కువగా శ్రద్దపెట్టేవారు. తాను ఏం చేయలేకపోయిందో అది మేం చేయానుకొనేది. చదువు విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేదని చెప్పారు.

సినిమా, రాజకీయరంగాలపై ఆసక్తి లేదు

సినిమా, రాజకీయరంగాలపై ఆసక్తి లేదు

మా ఇంట్లో చదువుకే ప్రాధాన్యం ఎక్కువ. అందరి దృష్టి చదువు మీదే. సినిమా షూటింగ్ లకుు కూడ వెళ్ళేవాళ్ళం కాదు. మా అమ్మ వాళ్ళ కుటుంబంలో చదువుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. వేసవిలో క్యాంప్స్ కు వెళ్ళేవాళ్ళం. విదేశాల్లో ఏదైనా వర్క్ షాపులకు వెళ్ళేవాళ్ళం. సినిమాల్లోకి కానీ, రాజకీయాల్లోకి కానీ వెళ్ళాలనే ఆలోచనే రాలేదు. అందుకే చదువుపై కేంద్రీకరించినట్టు బ్రహ్మణి చెప్పారు.

స్ట్రెస్ నుండి ఎలా రిలాక్స్ అవుతారు

స్ట్రెస్ నుండి ఎలా రిలాక్స్ అవుతారు

మా అబ్బాయి దేవాన్ష్ ను చూడగానే స్ట్రెస్ మొత్తం పోతోంది. హి ఈజ్ మై స్ట్రెస్ బస్టర్. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసు పని పెట్టుకోనే. కుటుంబసభ్యులతో గడుపుతా. ఆ తర్వాతే ఫ్రెండ్స్. ప్రస్తుతం మామయ్య, లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్ మెంట్ లో బిజీగా ఉన్నారు. లోకేష్ ఇంతకు ముందు కనీసం మేసేజ్ లో టచ్ లో ఉండేవారు. మినిష్టర్ అయ్యాక మేసేజ్ లు కూడ లేవు. వాళ్ళ ముందు చాలా గోల్ ఉందన్నారు బ్రహ్మణి.

స్టోర్స్ ప్రారంభోత్సవానికి దేవాన్ష్ కూడ తీసుకెళ్తాను

స్టోర్స్ ప్రారంభోత్సవానికి దేవాన్ష్ కూడ తీసుకెళ్తాను

లోకేష్ మంత్రయ్యాక రెండు వారాలకోసారి దేవాన్ష్ ను చూసేందుకు వస్తున్నాడు. బిజీగా ఉండడం వల్లే ఆయనకు సాధ్యం కావడం లేదు. అయితే బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. మా అత్తగారు కూడ చాలా సపోర్ట్ గా ఉంటారు.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది 75 నుండి 80 శాతం వరకు ఎవరూ చేయలేరు.వందశాతం ఎవరూ చేయలేరు. ఒకవేళ వర్క్, ఫ్యామిలీ రెండు ముఖ్యమైనవి అయినప్పుడు రెండింటినీ మిక్స్ చేస్తాను. జనరల్ గా శనివారాల్లో స్టోర్స్ ఒపెనింగ్స్ ఉంటాయి. అలాంటి సమయంలో అత్తగారిని, దేవాన్ష్ ను తీసుకెళ్తాను. తనుకూడ స్టోర్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. స్టోర్స్ విజిట్ చేసినప్పుడు కూడ దేవాన్ష్ ను తీసుకెళ్తాను.

చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదాన్ని

చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదాన్ని

చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదాన్ని అని బ్రహ్మణి చెప్పారు.స్కూల్లో స్టూడెంట్స్, టీచర్స్ టీజ్ చేసేవారు. అయితే స్పోర్ట్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం, జిమ్ కు వెళ్ళి వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గాను. ఇప్పుడు టైం దొరకడం లేదు. అయినా ఫిట్ నెస్ అన్నది ఫార్ట్ ఆఫ్ మై లైఫ్. ఈ విషయంలో అత్తయ్య నాకు స్పూర్తి. తను చాలా లావుగా ఉండేవారు. ఒక్క ఏడాదిలోనే ఆమె 60 కేజీల బరువు తగ్గారు. ఒక స్విమ్మింగ్ , జాగింగ్ చేయడం స్ట్రెస్ బస్టర్స్ గా ఉపయోగపడతాయి. ఇక ఫుడ్ నా వీక్ నెస్. ఐ లవ్ ఫుడ్ . స్పెషల్ ఆకేషన్స్ ఉన్నప్పుడు ఐ లవ్ టూ ఈట్ బయటకు రెస్టారెంట్స్ కు వెళ్ళడమంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు.

తాత ఆశయాల కోసం ట్రస్ట్ లో పనిచేస్తున్నా

తాత ఆశయాల కోసం ట్రస్ట్ లో పనిచేస్తున్నా

ఎన్టీఆర్ ట్రస్ట్ దాదాపుగా 20 ఏల్ళుగా నడుస్తోంది తాత ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి ట్రస్ట్ ద్వారా కృషి చేస్తుంటామని చెప్పారు. హెల్త్ , ఎడ్యుకేషన్, సేప్ డ్రింకింగ్ వాటర్, ఎంఫర్ మెంట్ , డిజాస్టర్ రిలీఫ్, తెలుగు భాష, సంస్కృతి విభాగాల్లో కృషి చేస్తుంటామన్నారు.ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్టు చెరప్పారు. ట్రస్ట్ లో జాయిన్ అయ్యాక బాలిక విద్యపై కేంద్రీకరించినట్టు చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశామం. మహిళల స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్టు చెప్పారు. డిజాస్టర్స్ వచ్చినప్పుడు వలంటీర్స్ ను ఏర్పాటు చేసి సహాయం అందించడం చేస్తున్నట్టు చెప్పారు.

ఆకస్మికంగా తనిఖీ చేస్తాం

ఆకస్మికంగా తనిఖీ చేస్తాం

అవుట్ లెట్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. అయితే నా కన్నా మా అత్తగారు ఎక్కువగా ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటారు. హెరిటేజ్ స్టోర్స్ కు కాకుండా ప్లాంట్స్ కు కూడ వెళ్తుంటారు. వారంలో మూడు లేదా నాలుగు రోజులు హెరిటేజ్ పనిమీదే ట్రావెల్ చేస్తుంటారు. కంపెనీలో ప్రొఫెషనల్ గా టఫ్ గా ఉండాలి. ఉండక తప్పదన్నారామె. అదే సమయంలో ఆఫీస్ లో ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్ ఉంటుంది. అందరినీ సమానంగా చూస్తామని చెప్పారు. ఎంప్లాయిస్ గా కాకుండా కొలిగ్స్ గా భావిస్తామన్నారు.

రైతుల సంక్షేమం కోసం

రైతుల సంక్షేమం కోసం

ప్రతి రోజూ దాదాపుగా మూడులక్షల మంది రైతుల నుండి పాలు సేకరిస్తున్నాం. రోజూ రెండు సార్లు తీసుకొంటాం. రైతుల నుండి పాలు సేకరించడమే కాకుండా వారికి ఏం కావాలో కూడ తెలుసుకొంటామన్నారు. వారికి సబ్సిడీపై పశువుల దాణా అందిస్తామన్నారు. ప్రతి లీటర్ కు పాలకు పదిపైసలను ట్రస్ట్ లో వేస్తాం. రైతులు కూడ లీటర్ పాలకు పదిపైసలను ట్రస్ట్ కు ఇస్తారు. ఇలా పక్కనపెట్టిన డబ్బును రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తామన్నారు బ్రహ్మణి.ఈ ట్రస్ట్ లో రిజిస్టర్ అయిన రైతులకు రెండు లక్షల వరకు ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. మెడికల్ కవరే్ 50 వేల రూపాయాల వరకు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులకు ఇది ప్రయోజనాన్ని అందిస్తున్నట్టు చెప్పారు.

సలహాలను అడుగుతా

సలహాలను అడుగుతా


కంపెనీ విషయంలో అవరమైతే మామయ్య , లోకేష్ సలహాలను అడుగుతానని ఆమె చెప్పారు. మా కంపెనీ ప్రొఫెషనల్ గా రన్ అవుతోంది. ప్రతి డివిజన్ కి ఓ హెడ్ ఉంటారు. సీఈఓ ఉంటారు.వారే అన్నీ చూసుకొంటారు. చాలా అనుభవం ఉన్న ఉద్యోగులున్నారు. కంపెనీలో వచ్చే సమస్యలకు వారు అక్కడికక్కడే పరిష్కారం చూపుతారు. ఆ స్థాయిలో కాకపోతే మా దగ్గరకు వస్తాయి. విదేశాల్లో నేర్పే పద్దతులు వేరుగా ఉంటాయి పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు వచ్చి కేస్ స్టడీస్ లు వివరిస్తారు. వాటిని విశ్లేషిస్తామన్నారామె.

English summary
Iam the class first student said Nara Brahmani. This credit goes to my mother Vasundara. A telugu channel (ABN- Andhrajyothy) interviewed Brahmani.she spoke interesting things in her life
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X