వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వనజాక్షిపై దాడి ఘటన: విచారణాధికారిగా జెసి శర్మ, నెలలో నివేదిక

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనపై ఐఎఎస్ అధికారి జెసి శర్మ విచారించనున్నారు. ఈ ఘటనలో విచరణాధికారిగా ఆయనను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ జరిపి నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కూడా ప్రభుత్వం సూచించింది.

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు వనజాక్షిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ కృష్ణా జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించారు.

IAS officer JC Sharma will enquir Vanajakshi incident

కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. వనజాక్షఇ దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది.

కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ సంఘాలు వనజాక్షికి అండగా నిలిచాయి. దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సంఘాలతో చర్చించారు. వనజాక్షి పైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ అనుచరుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి ఓ కమిటీ వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో శర్మను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది.

English summary
IAS officer JC Sharma has been appointed as enquiry officer to probe in alleged attack on Musunuru MRO Vanajakshi in Krishna district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X