వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్‌షా తో ఐఏయస్ శ్రీల‌క్ష్మి స‌మావేశం: జ‌గ‌న్ త‌న టీంలోకి తీసుకోవాల‌ని..కానీ: ఏం జ‌రుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

ఐఏయ‌స్ అధికారి శ్రీల‌క్ష్మి. తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న పేరు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో అభియోగాలు.. జైలు శిక్ష ఎదుర్కొన్నారు. అనారోగ్యం పాల‌య్యారు. అటువంటి అధికారి ప్ర‌స్తుతం తెలంగాణ కేడ‌ర్‌లో ప‌ని చేస్తున్నారు .ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత శ్రీల‌క్ష్మి ఏపీకి రావాల‌ని భావించారు. త‌న మీద క‌క్ష్య‌తో కేసులు న‌మోదు చేసి అందులో మ‌హిళా అధికారిని సైతం ఇబ్బంది పెట్ట‌టంతో..

త‌న ప్ర‌భుత్వంతో ఆమె ప్ర‌తిభ‌కు ఆధారంగా సేవ‌లు అందించే అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఇందు కోసం శ్రీలక్ష్మి సైతం స‌రే అన్నారు. ఏపికి కేటాయించాల ని కోరారు. కేసీఆర్ ఆమోదించారు. ఇక త్వ‌ర‌లోనే ఏపీలోకి వస్తార‌ని అనుకుంటున్న స‌మ‌యంలో..శ్రీల‌క్ష్మి స‌డ‌న్‌గా కేంద్ర హోం మంత్రి..బీజేజీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాతో స‌మావేశ‌మ‌య్యారు.

జ‌గ‌న్ కేసుల్లో శ్రీల‌క్ష్మి జైలు శిక్ష‌..

జ‌గ‌న్ కేసుల్లో శ్రీల‌క్ష్మి జైలు శిక్ష‌..

అతి చిన్న వ‌య‌స్సులో ఐఏయస్ అయ్యారు శ్రీల‌క్ష్మి. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీలక్ష్మి కెరీర్‌ ఒడిదుడుకు ల్లేకుండా సాగితే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి స్థాయికి వెళ్లేవారు. అమిత్‌అయితే, వైయ‌స్సార్ హాయంలో శ్రీల‌క్ష్మీ మైనింగ్ కార్య‌ద ర్శిగా ప‌ని చేసారు. అయితే, వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్ పైన న‌మోదైన అక్ర‌మాస్తుల కేసుల స‌మ‌యంలో.. ఓబుళాపురం గ‌నుల అవినీతి కేసు శ్రీల‌క్ష్మి పైన సీబీఐ న‌మోదు చేసింది. దాదాపు రెండేళ్లు జైలు శిక్ష అనుభ‌వించారు. ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం పాల‌య్యారు. ఆ త‌రువాత రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో శ్రీల‌క్ష్మి తెలంగాణ‌కు కేటాయించా రు. అక్క‌డే ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్నారు. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాత ఆయ‌న్ను క‌లిసి త‌న‌కు ఏపీలో ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. జ‌గ‌న్ సైతం వెంట‌నే స‌రే అన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సీఎంతో చ‌ర్చించారు. ఆయ‌న సైతం ఆమోదించి రిలీవ్ చేసారు. కానీ, కేంద్ర డీఓపీటీ శాఖ సైతం ఆమోదించాల్సి ఉంది. ఇప్ప‌టికీ ఆ క్లియ‌రెన్స్ రాక‌పోవ‌టంతో ఇంకా ఏపీలో పోస్టింగ్ ఇవ్వ‌లేదు.

కొత్త రేషన్ కార్డులు ఇక ఇంటికే..! కసరత్తు చేస్తున్న ఏపి సర్కార్..!! కొత్త రేషన్ కార్డులు ఇక ఇంటికే..! కసరత్తు చేస్తున్న ఏపి సర్కార్..!!

అమిత్‌షా తో శ్రీలక్ష్మీ స‌మావేశం...

అమిత్‌షా తో శ్రీలక్ష్మీ స‌మావేశం...

దాదాపు నెల రోజుల క్రితం తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీ సీఎం సూచ‌న‌..శ్రీల‌క్ష్మి అభ్య‌ర్ద‌న మేర‌కు అమెను రిలీవ్ చేసింది. ఆ త‌రువాత ఈ వ్య‌వ‌హారం కేంద్ర డిపార్ట్‌మెట్ ఆప్ ప‌ర్స‌న‌ల్ ట్రైయినింగ్ ప‌రిధిలోకి వెళ్లింది. అక్క‌డ రాష్ట్ర కేడ‌ర్ మా ర్పు పైన అభ్య‌ర్ది చేసుకున్న విజ్ఞ‌ప్తిని లోతుగా ప‌రిశీలిస్తారు. వారు త‌మ బ‌దిలీకి చూపించిన కార‌ణాల పైన అధ్య‌య‌నం చేసి..ఆ త‌రువాత మాత్ర‌మే రిలీవ్ చేస్తారు. ఈ ప్ర‌క్రియ ఆలస్యం అవుతున్న ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దీని పైన విజ‌య సాయిరెడ్డ‌కి శ్రీల‌క్ష్మితో పాటుగా స్టీఫెన్ ర‌వీంద్ర ఫైళ్ల క్లియ‌రెన్స్‌కు బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు. దీంతో శ్రీల‌క్ష్మి పార్ల‌మెంట్‌కు వెళ్లారు. హోం మంత్రి అమిత్‌షాను క‌లిసారు. త‌న అభ్య‌ర్ధ‌న‌ను వివ‌రించారు. అమిత్ షా సైతం వెంట‌నే స‌మ్మ‌తించారు. కేంద్ర‌లో పెండింగ్‌లో త‌న శాఖ ప‌రిధిలోని డీఓపీటీలో పెండింగ్‌లో ఉన్న ఆ ఫైల్ ను ప‌రిశీల‌న చేస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో..త్వ‌ర‌లోనూ శ్రీల‌క్ష్మి రిలీవ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

శ్రీల‌క్ష్మి..స్టీఫెన్‌ల‌కు కీల‌క పోస్టింగ్‌లు..

శ్రీల‌క్ష్మి..స్టీఫెన్‌ల‌కు కీల‌క పోస్టింగ్‌లు..

ఐఏయస్ అధికారిని శ్రీల‌క్ష్మి స‌మ‌ర్ధ‌త గ‌ల అధికారిణి. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్రభుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఇప్పుడు కేంద్రం రిలీవ్ చేసిన వెంట‌నే ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క పోస్టింగ్ ద‌క్కే విధంగా ఇప్ప‌టికే జ‌గ‌న్ నిర్ణ‌యించారు. శ్రీల‌క్ష్మికి ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో పోస్టింగ్ ఇస్తార‌ని స‌మాచారం. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వంలో ప‌ని చేస్తున్న స్టీఫెన్ రవీంద్ర‌కు ఏపీలో ఇంట‌లిజెన్స్ చీఫ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు జ‌గ‌న్ సూచ‌న‌తో తెలంగాణ ప్ర‌భుత్వం రిలీవ్ చేసినా..కేంద్రం నుండి ఇంకా క్లియ రెన్స్ రాలేదు. కానీ, ఏపీలో అన‌ధికారికంగా ఆయ‌న త‌న విధులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ నెలాఖ‌రులోగా కేంద్రం సైతం సానుకూలంగా స్పందిస్తుంద‌ని..ఆ వెంట‌నే స్టీఫెన్ సైతం ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

English summary
IAS officer Sri Lakshmi met Central Home minister Amith Shah in Parliament to day requested for clearance of he file which pending in DOPT to allot her for AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X