వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో ఐఎఎస్‌ల షేక్‌హ్యాండ్‌లు, సెల్ఫీలు: వారిని చూడగానే ముచ్చెమటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొంత మంది ఐఎఎస్ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి తిప్పలు తప్పేట్లు లేవు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో కరచాలనాలు చేసి, సెల్ఫీలు తీసుకోవడమే అందుకు కారణం. ఈ మేరకు మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విమానంలో ఐఎఎస్ అధికారులు జగన్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శించారు. ఆ విమానంలో జగన్ ఎక్కారు. తిరుపతిలో జరుగుతున్న ఓ ప్రభుత్వ సమావేశానికి వెళ్లేందుకు కొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా ఆ ఫ్లయిట్ ఎక్కారు.

విమానం బయలుదేరటానికి పదిహేను నిమిషాల ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి కూడా వచ్చారు. ముందు సీట్లో కూర్చున్నారు. జగన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి సెల్ఫీలు తీసుకునే ముచ్చటలో మునిగిపోయారు. ఆ సమాచారం వెంటనే విజయవాడలో ఉన్న చంద్రబాబుకు చేరిపోయింది. ఇప్పుడు ఐఎఎస్ అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి.

 IAS officers selfies with YS Jagan

కొంతమంది ఐఏఎస్‌ అధికారులు మాత్రం జగన్‌కు హుందాగా విష్‌ చేసి తమ తమ స్థానాల్లో కూర్చుకున్నారు.. జగన్మోహన్‌ రెడ్డి కూడా వారికి ప్రతి నమస్కారం చేసి ముందు వరుసలో కూర్చున్నారు. జగన్మోహన్‌ రెడ్డి వచ్చారని తెలుసుకున్న మరికొంత మంది ఐఏఎస్‌లు ఆయన దగ్గరకు వెళ్లి పక్కన కూర్చుని సెల్ఫీలు తీసుకున్నారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు.

రేణిగుంటలో విమానం ఆగగానే అదే విమానంలో ఉన్న ఇద్దరు క్యాబినెట్‌ మంత్రులు తాపీగా ముందుకు వచ్చి నిలబడ్డారు. వీరిని చూసిన ఐఏఎస్‌లకు ముచ్చెమటలు పట్టాయి. వారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడలేదు గానీ కొంత మంది ఐఎఎస్ అధికారులు జగన్‌తో కలివిడిగా ఉన్న విషయాన్ని, ఆయనతో మాట్లాడిన విషయాన్ని గమనించారు.

రేణిగుంట ఎయిర్‌పోర్టులో కారెక్కిన వెంటనే మంత్రులు కొంత మంది ఐఎఎస్‌ల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు. తమకు బదిలీల గండం తప్పదేమో ఆందోళనతో వారున్నట్లు తెలుస్తోంది.

English summary
Few IAS officers have viven shake hand to YSR Congress party president YS Jagan are fearing of trnasfer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X