TTD మాజీ ఈవో శ్యామలరావు అలక, బదిలీ వెనుక - సెలవు..!!
టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు అలకబూనారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ ఈవోగా శ్యామలరావును ఏరి కోరి ఎంపిక చేసారు. తిరుపతిలో తొక్కిసలాట సమయం నుంచి శ్యామలరావు బదిలీ పైన చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో శ్యామలరావును టీటీడీ నుంచి తప్పించి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే, ఆ పోస్టులో చేరలేదు. తాజాగా మూడు నెలల సెలవు కోరుతూ ప్రభుత్వానికి లేఖ సమర్పించారు. శ్యామలరావు టీటీడీ నుంచి బదిలీ వెనుక కారణాల పైనా చర్చ జరుగుతోంది.
టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు తన కొత్త పోస్టింగ్ లో చేరేందుకు సుముఖంగా లేరు. దీంతో, సెలవు పై వెళ్లేందుకు సిద్దమయ్యారు. టీటీడీ ఈవోగా శ్యామలరావును సీఎం చంద్రబాబు ఏరి కోరి ఎంపిక చేసారు. కాగా.. టీటీడీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఎప్పటికప్పుడు సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. తిరుమల పర్యటన సమయంలోనూ ముఖ్యమంత్రికి పలు అంశాల పైన సమాచారం అందింది. టీటీడీ ఛైర్మన్ తోనూ విభేదాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత ఈవో పైన వేటు పడుతుందనే ప్రచారం సాగింది. అయితే, దీని పైన నియమించిన విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యుల పైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈవోగా ఉన్న శ్యామలరావును తప్పించి ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించారు.

కాగా.. శ్యామలరావు బదిలీ సమయంలో తనకు ప్రాధాన్యత కలిగిన పోస్టుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి అనుగుణంగా ఆయన్ను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే, ఈ పోస్టులో చేరేందుకు శ్యామలరావు సిద్దంగా లేరు. తనకు ఆరోగ్య కారణాలతో మూడు నెలలు సెలవు కావాలని ప్రభుత్వానికి లేఖ రాసారు. అయితే, ప్రభుత్వం ఈ నెల ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సదస్సు నిర్వహణలో జీఏడీ కీలక భూమిక పోషిస్తుంది. ఇదే సమయంలో శ్యామలరావు తన కొత్త బాధ్యతల్లో చేరకపోవటం పైన అధికారిక వర్గాల్లో చర్చ మొదలైంది. అదే సమయంలో గవర్నర్ స్పెషల్ సీఎస్ గా నియమితులైన అనంతరాము, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులైన దండే సైతం ఇంకా తమ బాధ్యతల్లో చేరలేదు.












Click it and Unblock the Notifications