• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనం

|

పార్టీలు వేరైనప్పటికీ, ఇరుగు పొరుగు రాష్ట్రాల అధినేతలు, మంత్రుల మధ్య సంఖ్యత ఉండటం సర్వసాధారణం. కానీ తాను మంత్రిగా పనిచేస్తోన్న రాష్ట్రం కంటే పక్క రాష్ట్రంలోనే పాలన బాగుందని.. తన బాసైన సీఎం కంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రే ఎక్కువని చెప్పడం బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఆ పొరుగురాష్ట్ర నేత కాగా.. ఆయన పొగడ్తలతో ముంచేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం రాజకీయ వర్గాలతోపాటు సామాన్య జనంలోనూ సంచలనం రేపుతోన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

జగన్‌కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్

అతిథిగా వచ్చి అదరగొట్టారు..

అతిథిగా వచ్చి అదరగొట్టారు..

ఏపీలో జగన్ సర్కారు ఇటీవలే 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన దరిమిలా, వాటి చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణస్వీకారాలను ‘బీసీ సంక్రాంతి' పేరుతో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అతిథిగా హాజరయ్యారు. అందరిలోకీ సంచలన అంశాలతో కూడిన ప్రసంగం చేసి అదరగొట్టారు. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ వైఎస్‌ జగన్‌ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాయని పుదుచ్చేరి మంత్రి చెప్పారు. ఏపీ సీఎం జగన్ రమ్మని పిలిస్తే.. పుదుచ్చేరిలో మంత్రి పదవికి తక్షణం రాజీనామాచేసి వచ్చేస్తానని మల్లాడి అన్నారు. ఆయన ప్రసంగం తాలూకు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళనాట జగనన్న బాట..

తమిళనాట జగనన్న బాట..

‘‘మాట నిలుపునే మనిషిగా, మడమ తిప్పని వ్యక్తిగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను తమిళనాడు, పుదుచ్చేరి రాష్టాల ప్రజలు కూడా కోరుకుంటున్నాయి. కరోనా సమయంలో వివిధ పధకాలతో పేదలను ఆదుకున్నారు. 139 బీసీ కులాలకు జగన్ అండగా నిలిచారు. ఏకంగా ఒకే సారి 56 బీసీ కార్పొరేష్లు ఏర్పాటు చేసిన ఈ సందర్భాన్ని చాలా మంది ముందస్తు సంక్రాంతిఅనో, ముందస్తు క్రిస్మస్ గానో అభివర్ణిస్తున్నారు. నా వరకైతే ఈ ఘట్టం.. వెనుకబడిన జాతులకు నిజంగా స్వాతంత్ర్యం వచ్చినట్లుగా భావిస్తున్నాను. జగన్ ఒక్క పిలుపునిస్తే..

జగన్ కోసం మంత్రి పదవి వదిలేస్తా..

జగన్ కోసం మంత్రి పదవి వదిలేస్తా..

వచ్చే ఏడాదిలో నేను పాండిచేరి రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెబుతున్నాను. జగన్ ఒకే ఒక్క పిలుపునిస్తే చాలు.. ఆయన కుటుంబానికి సేవ చేసుకోడానికి నేను పరుగెత్తుకుంటూ వస్తాను. అలా కాదు, వెనుకబడిన జాతికి చెందిన వ్యక్తిగా నీ సలహాలు, సూచనలు ఇప్పుడే అవసరమని జగన్ అంటే గనుక తక్షణమే నా (పుదుచ్చేరి) మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏపీలో నాకు పదవులు గట్రా ఏవీ వద్దు. వైఎస్ కుటుంబం ఉన్నంతకాలం వాళ్లకు సేవ చేసుకోవాలనే నేను ఆశిస్తున్నాను.

పెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషి

మా సీఎం కంటే జగనే ఎక్కువ

మా సీఎం కంటే జగనే ఎక్కువ

దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యేగా నాకు మూడోసారి అవార్డు దక్కింది. ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైనందుకుగానూ వచ్చే నెల (జనవరి 26న) పుదుచ్చేరి ప్రభుత్వం నాకు సన్మానం చేయబోతున్నది. అంతకంటే ముందు ఈనెల 6న నా సొంత నియోజకవర్గమైన యానాంలో సన్మాన సభ ఉంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఇన్విటేషన్‌ను మా ముఖ్యమంత్రి(నారాయణస్వామి) కంటే ముందుగా మీ ముఖ్యమంత్రి(జగన్)కు ఇవ్వడానికే నేను ఇక్కడి(విజయవాడ)కి వచ్చాను. జనవరి 6న యానాంలో జరిగే ఫంక్షన్ లో తూర్పుగోదావరి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అఫీషియల్ గా పంపాల్సిందిగా ఈ సభ ద్వారా సీఎం జగన్ ను కోరుతున్నాను''అని మల్లాడి కృష్ణారావు అన్నారు.

వైఎస్సార్ హార్ట్ కోర్ ఫ్యాన్

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండే యానాం ప్రాంతం.. టెక్నికల్ గా అసెంబ్లీతో కూడిన కేంద్ర ప్రాంతం పాలిపుదుచ్చేరి కిందికి వస్తుందన్న సంగతి తెలిసిందే. యానాం అసెంబ్లీ స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా(రెండు సార్లు ఇండిపెండెంట్, మూడు సార్లు కాంగ్రెస్ తరఫున) గెలుపొందిన మల్లాడి కృష్ణారావు.. వైఎస్సార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో అగ్రగామి. వైఎస్సార్ ను విపరీతంగా ఆరాధించి, అభిమానించే కృష్ణారావు.. తన యానాం పట్టణంలో అతిపెద్ద వైఎస్సార్ విగ్రహాన్ని నెలకొల్పారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ తోనూ అదే రకమైన సంబంధాలు కొనసాగిస్తోన్న కృష్ణారావు.. పుదుచ్చేరి కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ తరచూ జగన్ పై పొగడ్తలు కురిపిస్తుంటారు. అంతేకాదు..

చంద్రబాబుపై మల్లాడి ఫైర్

చంద్రబాబుపై మల్లాడి ఫైర్

గతేడాది ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు.. ఏపీ రాజకీయాలపై తరచూ కామెంట్లు చేస్తుంటారు. చంద్రబాబు సీఎంగా ఉండి బీసీలను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీసీలకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు పదవిలో కొనసాగాలని డిమాండ్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏపీలోని వైసీపీ నేతలకు ఉండాల్సిన లక్షణాలు.. పుదుచ్చేరి మంత్రి కృష్ణారావులో పది రెట్లు ఎక్కువ కనిపిస్తాయి. రాజకీయంగానేకాదు..

  రైతులకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత V.Hanumantha Rao దీక్ష!
  భార్యకు అంకితమిచ్చిన మల్లాడి

  భార్యకు అంకితమిచ్చిన మల్లాడి

  పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు రాజకీయాల్లోనేకాదు, వ్యక్తిగతంగానూ గొప్ప పేరు పొందారు. ప్ర‌జ‌ల ముందుగానీ, పార్టీ కార్య‌క‌ర్త‌ల ముందుగానీ తాను ఒక మంత్రిని అనే ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌కుండా, సాదాసీదాగా అందరితో కలిసిపోతారు. ఆ మధ్య కరోనా పీక్స్ లో ఉన్న సమయంలో కొవిడ్ ఆస్పత్రుల్లోకి వెళ్లాలంటేనే నాయకులు భయపడిపోయిన వేళ.. మంత్రి కృష్ణారావు పుదుచ్చేరిలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో టాయిలెట్లు శుభ్రం చేసి సఫాయీ కార్మికులకు సంఘీభావం, కొవిడ్ పట్ల ప్రజల్లో మనోస్థైర్యం కలిగించారు. దేశంలోనే ఉత్తమ శాసనసభ్యునిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చరిత్ర ఆయనది. 2000లో తొలిసారి బెస్ట్ ఎమ్మెల్యే అవార్డును తన గురువైన హరికృష్ణకు అంకితం చేయగా, రెండవ సారి 2005లో వచ్చిన ఉత్తమ శాసనసభ్యుడు అవార్డును తన యానాం ప్రజలకు అంకితమిచ్చారు. ఇక ఈ ఏడాది(2020లో) సాధించిన బెస్ట్ ఎమ్మెల్యే అవార్డును.. తన రాజకీయ జీవితంలో పాతిక సంవత్సరాల పాటు వెన్నంటే ఉండి ముందుకు నడిచిన తన భార్యకు ఉదయలక్ష్మికి అంకితమిచ్చారు. వచ్చే ఏడాది పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి అక్కడి రాజకీయాలను వదిలేసి ఏపీలో జగన్ కోసం పనిచేయాలనే కృష్ణారావు కోరిక తీరుతుందో లేదో కొద్ది నెలల్లోనే తేలిపోనుంది.

  English summary
  Puducherry Minister Malladi Krishna Rao praised andhra pradesh cm ys jagan during BC Sankranti Sabha at Vijayawada on thursday. Krishna Rao said that the people of Tamil Nadu and Puducherry want a chief minister like YS Jagan Mohan Reddy. 'aim ready to resign as puducherry minister and will join with ap cm jagan', he added
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X