• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నంద్యాల: మౌనిక దూకుడు, అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టమేనా?

By Narsimha
|
  Nandyal By Polls : Balakrishna Money Distributing To Voters Viral In Social Media | Oneindia Telugu

  నంద్యాల:నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఏపీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక వ్యవహరించిన తీరు పట్ల టిడిపి నాయకత్వం సంతోషంతో ఉంది. బ్రహ్మనందరెడ్డి కాకుండా మౌనిక నంద్యాలలో బరిలో నిలిస్తే మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉండేదని ఆ పార్టీ నాయకులు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.

  నంద్యాల: బిజెపికి దూరంగా టిడిపి, వైసీపీ కొంపముంచిందా?

  నంద్యాల ఉప ఎన్నికల సమయంలో భూమా మౌనిక దూకుడు పార్టీకి కలిసివచ్చిందని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.నంద్యాల ఉప ఎన్నికల్లో మౌనిక పేరు తొలుత విన్పించింది. కానీ, బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపారు.

  గోస్పాడు ఎఫెక్ట్: నంద్యాలలో వైసీపీకి దెబ్బ, జగన్ అంచనాలు తారుమారు

  మౌనిక రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిని చూపారనే వార్తలు కూడ వచ్చాయి. కానీ, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మౌనిక కుటుంబ వ్యవహరాలను చూసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపాల్సి వచ్చింది.

  ''జగన్ చెప్పినట్టుగానే నంద్యాల తీర్పు, రాజకీయ సన్యాసంపై శిల్పా మౌనం వీడాలి''

  నంద్యాల ఉప ఎన్నిక సమయంలో నిర్వహించిన ఎన్నికల సభల్లోనూ భూమా మౌనిక ప్రసంగించిన తీరు ప్రజలను ఆకట్టుకొనే విధంగా ఉందని టిడిపి సీనియర్లు గుర్తించారు.

  మౌనిక దూకుడు కలిసివచ్చింది

  మౌనిక దూకుడు కలిసివచ్చింది

  నంద్యాల ఉపఎన్నికల సమయంలో భూమా మౌనిక వ్యవహరించిన తీరు పార్టీకి కలిసివచ్చిందనే అభిప్రాయంతో పార్టీ సీనియర్లున్నారు. ఎన్నికల సమయంలో ఆమె ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారని కొందరు పార్టీ సీనియర్లు బాబు దృష్టికి తీసుకెళ్ళారు. ప్రసంగాలతో ప్రజలను తన వైపుకు తిప్పుకొనే సామర్థ్యం కూడ ఉందని టిడిపి నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.

   మద్దతు దారులను కూడగట్టిన మౌనిక

  మద్దతు దారులను కూడగట్టిన మౌనిక

  నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి మద్దతుగా నిలిచేవారిని మౌనిక కూడగట్టారు. భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత భూమా కుటుంబానికి అండగా నిలిచేవారిని మౌనిక వ్యక్తిగతంగా కిలిసి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. ప్రజలతో చొరవగా కలిసే మనస్తతత్వం మౌనికకు ఉంది. ప్రజలు చెప్పే సమస్యలన ఓపికగా వినడం, వారికి సమాధానాలు చెప్పడం కూడ కొందరు టిడిపి నేతల దృష్టిలో పడింది.

  మౌనికను రంగంలోకి దించితే పరిస్థితి మరోలా ఉండేది

  మౌనికను రంగంలోకి దించితే పరిస్థితి మరోలా ఉండేది

  నంద్యాలలో భూమా మౌనికను రంగంలకి దించితే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు టిడిపి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బ్రహ్మనందరెడ్డి దూకుడుగా వ్యవహరించినా... మౌనికతో పోలిస్తే కొంత వెనుకబడ్డారనే అభిప్రాయాలను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రహ్మనందరెడ్డి కాకుండా మౌనికను ఎన్నికల బరిలో నిలిపితే మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉండేదని పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.

  పోలింగ్ రోజున ఫ్యాక్షన్ గ్రామాల్లో మౌనిక టూర్

  పోలింగ్ రోజున ఫ్యాక్షన్ గ్రామాల్లో మౌనిక టూర్

  పోలింగ్ రోజున ఫ్యాక్షన్ గ్రామాల్లో భూమా మౌనిక పర్యటించడం టిడిపి అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరడం సంచలనం కల్గించింది. కొన్ని పోలింగ్ బూత్‌ల్లో ఆమె వ్యవహరించిన తీరు పట్ల వైసీపీ ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు చేసింది.ఆయా గ్రామాల్లో పర్యటించి పోలింగ్ సరళిని ఆమె తెలుసుకొన్నారు.నంద్యాల ఎన్నికల్లో ఇంచార్జీలుగా వ్యవహరించిన పార్టీ నేతలు మౌనిక పార్టీలో చురుకుగా పాల్గొంటే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Some Tdp leaders appreciated Bhuma Mounika attitude in Nandyal bypoll. Mounika actively campaigned in bypoll . If Mounika participated as Tdp candidate in Nandyal... huge majority got to tdp. one of the Tdp leader chit chat with media on Nandyal by poll result.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more