వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత కండకావరమా..? ఆ 29 గ్రామాలు దాటితే రాళ్ల వర్షమే.. : చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ది వికేంద్రీకరణ,పాలనా వికేంద్రీకరణే శరణ్యం అన్నారు మంత్రి కన్నబాబు. మండలి ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత.. చంద్రబాబుకు హారతులు,పూలవర్షంతో టీడీపీ నేతలు హడావుడి చేశారని గుర్తుచేశారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించినంత మాత్రానా ఏదో సాధించామని టీడీపీ సంబరాలు చేసుకుంటుండటం హాస్యాస్పదం అన్నారు. టీడీపీని చూసి జనం నవ్వుకుంటున్నారన్న జ్ఞానం కూడా వాళ్లకు లేదన్నారు.

ఆ 29 గ్రామాలు దాటితే రాళ్ల వర్షమే...

ఆ 29 గ్రామాలు దాటితే రాళ్ల వర్షమే...

చంద్రబాబు చేసిన పనికి అమరావతి చుట్టు పక్కల 29 గ్రామాల్లో పూలు వేస్తారేమో గానీ.. ఆ గ్రామాలు దాటితే ప్రతీ గ్రామంలోనూ ఆయనపై రాళ్లు పడుతాయని హెచ్చరించారు.మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి బిల్లులను అడ్డుకోవడంపై చర్చ జరగాలని కన్నబాబు అన్నారు. వాటిపై సవరణలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉన్నప్పుడు.. అసెంబ్లీలో సభా నాయకుడికి విచక్షణాధికారాలు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.

మంగళగిరిలో ఓడిన సంగతి గుర్తు లేదా..

మంగళగిరిలో ఓడిన సంగతి గుర్తు లేదా..

చంద్రబాబు కోసం రాసే పత్రికలు,టీడీపీ నేతలను చూపించే ఛానెల్స్ వాళ్లు ఏం చేసినా గొప్పగానే చెబుతాయన్నారు. కొంతమంది సభ్యులు టీవీ చానెళ్లలో కూర్చొని తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. అలాంటి వారిపై ప్రివిలేజ్ మోషన్ కింద చర్యలు తీసుకోవాలన్నారు. ఇక సభకు వైసీపీ సభ్యులు తాగి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, బ్రీత్ అనలైజర్స్ కూడా పెట్టాలంటున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు అంత కండకావరమేంటని ఫైర్ అయ్యారు.మాట్లాడితే.. రాజధానిపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు అంటున్నారని.. మంగళగిరిలో లోకేష్‌ను ప్రజలు ఓడించిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు,ఇంగ్లీష్ మీడియం బిల్లు,సీఆర్డీఏ రద్దు బిల్లు,అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు.. అన్నింటిని టీడీపీ అడ్డుకుందని, ఎన్ని రోజులని అడ్డుకుంటారని నిలదీశారు.

పక్క పార్టీల రాజకీయం కూడా చంద్రబాబే చేస్తున్నారు..

పక్క పార్టీల రాజకీయం కూడా చంద్రబాబే చేస్తున్నారు..

కొంతమందికి పేకాటకు బాగా అలవాటుపడి.. కొన్నిసార్లు ఇద్దరి ఆట ఒకరే ఆడుతుంటారని కన్నబాబు చెప్పారు. చంద్రబాబు కూడా అదే తరహాలో పక్క పార్టీల రాజకీయం కూడా ఆయనే చేస్తున్నారని విమర్శించారు. అందుకే సుజనా చౌదరిని తీసుకెళ్లి బీజేపీలో చేర్చాడని, పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని బీజేపీతో కలిపాడని,కమ్యూనిస్టులను తీసుకొచ్చి అమరావతి ఉద్యమంలో భాగం చేశాడని ఆరోపించారు.
ఎంతమంది ఒక్కటైనా.. ప్రజా అభివృద్ది,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ అనుకున్నది చేసి తీరుతారని స్పష్టం చేశారు.

బ్లాక్ డే కాదు.. యెల్లో డే..

బ్లాక్ డే కాదు.. యెల్లో డే..

నిబంధనల గురించి టీడీపీ నేత యనమల ఏవేవో మాట్లాడుతున్నారని.. ఆయన గురించి మాట్లాడితే చరిత్రలో ఎన్టీఆర్ ఎపిసోడే గుర్తుకు వస్తుందన్నారు. ఒక నాయకుడి చరిత్ర గొప్పగా లేకపోయినా.. చెడుగా మాత్రం ఉండకూడదన్నారు. గత ఐదేళ్లలో రాజ్యసభలో 22 బిల్లులు వీగిపోయాయని.. దీన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొన్ని సూచనలు చేశారని గుర్తుచేశారు. లోక్‌సభలో పాసైన బిల్లులపై రాజ్యభలో సభ్యులు ఇలా చేయడం సరికాదని, సభ్యులు పద్దతి మార్చుకోవాలని ఆయన సూచించినట్టు తెలిపారు. రాజ్యసభలో బిల్లులు వీగిపోతే అక్కడ ప్రతిపక్షాలు పెద్దగా సంబరాలేమీ చేసుకోవట్లేదని.. ఇక్కడ మాత్రం చంద్రబాబు అధికార పక్షాన్ని జయించినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలను చాలామంది బ్లాక్ డే అంటున్నారని.. కానీ తాను యెల్లో అంటున్నానని అభిప్రాయపడ్డారు. ఇకపై నిబంధనలకు విరుద్దంగా చట్టసభల్లో ఏదైనా జరిగితే దాన్ని యెల్లో డేగా పాటించాలన్నారు.

English summary
Minister Kannababu said if TDP chief Chandrababu Naidu comes out from 29 villages around Amaravathi, people will thrown stones at him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X