వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ నోరు మెదపరేం, లోకేశ్‌ను విచారిస్తే లక్ష కోట్ల బయటపడతాయి: అంబటి రాంబాబు

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాల్లో ఐటీ శాఖ దాడులు ప్రకంపనలు రేపుతోంది. రూ.2 వేల కోట్ల అవినీతి సొమ్ము దొరకడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాపం పడిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. నారా లోకేశ్‌ను విచారిస్తే లక్ష కోట్లు బయటపడుతాయని తెలిపారు. ఐటీ దాడులతో టీడీపీ బండారం బయటపడిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

సౌండ్ లేదు.. ఇక చంద్రబాబు సబ్జెక్ట్ క్లోజ్.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలుసౌండ్ లేదు.. ఇక చంద్రబాబు సబ్జెక్ట్ క్లోజ్.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఇలా వెలుగులోకి..

ఇలా వెలుగులోకి..

చంద్రబాబు నాయుడు మాజీ కార్యదర్శి శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయడంతో అవినీతి బయటపడిన సంగతి తెలిసిందే. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని అంబటి రాంబాబు తెలిపారు. ఐటీ దాడుల ప్రకంపనలతో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ నాయుడు పాపం పండిందని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు జీవిస్తున్నారాని అంబటి రాంబాబు ఆరోపించారు.

అరెస్ట్ చేయండి..

ఐటీ దాడుల కేసులో చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయుడును అరెస్ట్ చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎవరూ చంద్రబాబును కాపాడలేరని తెలిపారు. ఐటీ దాడుల్లో బయటపడినా రూ.2 వేల కోట్ల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తన స్పందనను పవన్ కల్యాణ్ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

డబ్బుతో సంబంధం..

డబ్బుతో సంబంధం..

చంద్రబాబు వెంట ఉండే.. సీపీఐ రామకృష్ణ ఎందుకు రియాక్ట్ కావడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజధాని మార్పుపై గొంతెత్తే నేతలు.. ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అడిగారు. రూ.2 వేల కోట్లతో శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు.. కానీ ఆ డబ్బుతో ఆయనకు సంబంధం ఉందని అంబటి రాంబాబు చెప్పారు.

రూ.2 వేల కోట్లు

రూ.2 వేల కోట్లు

తెలుగురాష్ట్రాల్లో దాడుల వివరాలను గురువారం ఐటీ శాఖ బయటపెట్టింది. 3 ఇన్ ఫ్రాం కంపెనీలపై దాడుల చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్టు పేర్కొన్నది. గతవారం హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్టణంలో ఐటీ శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. బోగస్ కంపెనీల పేరుతో వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఐటీ శాఖ తేల్చిచెప్పింది.

English summary
if it enquiry lokesh another one lakh crore Emerge ycp leader ambati rambabu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X