వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రిగోల్డ్‌తో సంబంధాలు నిరూపిస్తే .. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా... నారా లోకేష్‌ స్పీకర్‌కు లేఖ

|
Google Oneindia TeluguNews

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు నిరూపిస్తే... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించుకోలేకపోతే తమ్మినేని ఏం చేస్తారని అడిగారు.

ఇక ప్రభుత్వం ఏర్పడి అయిదునెలలు అవుతున్నా తనపై ఒక్క ఆరోపణ కూడ నిరూపించలేకపోయారని అన్నారు. వైఎస్ హయాంలో అగ్రిగోల్డ్ సంస్థ విస్తరించిందని, టీడీపీ హయాంలో బాధితుల వివరాలు సేకరించామని తెలిపారు. ఈ సంధర్భంగా స్పీకర్ తమ్మినేనికి లోకేష్ బహిరంగ లేఖ రాశారు.

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రతిపక్షల పార్టీల మధ్య రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో హట్‌ టాపిక్‌గా మారాయి.

If it proves relationship with Agri Gold scam I would resign for mlc says lokesh

ముఖ్యంగా వారు హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేయాలని చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు లోకేష్‌లు కుట్రలు పన్నారని స్పీకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.

స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు యనమల రామకృష్టుడుతో పాటు స్పీకర్ ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే అయిన కూన రవికూమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన రాజకీయా భవిష్యత్ కోసం స్పీకర్ పదవిని ముఖ్యమంత్రి జగన్ పాదల వద్ద పెట్టారని , ఆయన వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది.

మరోవైపు ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌ను ఆముదాలవలస సెంటర్‌లో నిలబెట్టి బట్టలుడదీస్తామని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ హెచ్చరించారు.

English summary
TDP state general secretary MLC Nara Lokesh responded to speaker tammineni Seetaram comments On Agrigold dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X