వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇప్పుడే ఇలా.. ఇక సీఎం అయితే జగన్ సామాన్యులను బతకినిస్తాడా?'

ఒక సీనియర్ పోలీసు అధికారిని 'తాట తీస్తా, రెండేళ్లలో నేను కాబోయే ముఖ్యమంత్రిని, కానీ పేరు గుర్తు పెట్టుకున్నా' అని జగన్ బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం అసభ్య పదజాలం ఉపయోగించడం,

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యేక హోదా ఉద్యమంపై గొంతెత్తడంతో వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ నేతలు మూకుమ్మడిగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య జగన్ పై విమర్శలు చేశారు.

ప్రతిపక్ష నేత హోదాలోనే జగన్ పోలీసులను, జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఇక సీఎం అయితే సామాన్యులను బ్రతకనిస్తాడా? అని వర్ల రామయ్య విమర్శించారు. ఎయిర్ పోర్టులో పోలీసు అధికారుల పట్ల జగన్ వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు జగన్.

If Jagan become CM it effects on Common Man says Varla Ramaiah

జగన్ రౌడీ భాష మానుకోవాలంటూ వర్ల సూచించారు. పోలీసు అధికారుల పట్ల జగన్ తీరు జుగుప్సాకరంగా ఉందని.. కనీసం పోలీస్ కానిస్టేబుల్ చిటికెన వేలు కూడా కదిలించలేనన్న సంగతి జగన్ తెలుసుకుంటే మంచిదని అన్నారు.

ఒక సీనియర్ పోలీసు అధికారిని 'తాట తీస్తా, రెండేళ్లలో నేను కాబోయే ముఖ్యమంత్రిని, కానీ పేరు గుర్తు పెట్టుకున్నా' అని జగన్ బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం అసభ్య పదజాలం ఉపయోగించడం, జగన్ లోని అసాంఘీక శక్తిని నిరూపిస్తోందన్నారు.

విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. టంగుటూరి ప్రకాశం పంతులును జగన్ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రకాశం పంతులు సీఎంగా ఉన్న కాలంలో.. ఓ కానిస్టేబుల్ పై ఒక కార్యకర్త చేయి చేసుకుంటే.. ప్రకాశం పంతులు వ్యవహరించిన తీరు గురించి జగన్ తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు.

సద్విమర్శలు చేస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్న వర్ల రామయ్య.. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు జగన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

English summary
TDP leader Varla Ramaiah Alleged that if jagan become CM in AP, there is no protection for Comman Man
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X