అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలా అయితే ఢిల్లీని కూడా మార్చాలి, చంద్రబాబు.. మోడీకి లేఖ రాయండి, అసెంబ్లీలో సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

రాజధాని మధ్యలో ఉండాలి అనుకొంటే ఢిల్లీని కూడా మార్చాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు, రామోజీరావు లేఖ రాయాలని జగన్ అన్నారు. తమిళనాడుకు చెన్నై కూడా మధ్యలో లేదని.. మహారాష్ట్రకు ముంబై కూడా లేదని చెప్పారు. ఈ మేరకు సభలో ఫోటోలు కూడా చూపించారు. జైపూర్, హైదరాబాద్ కూడా లేవని జగన్ చెప్పారు.

రైతుల పక్షపాతి..

రైతుల పక్షపాతి..


అమరావతికి అన్యాయం చేయబోనని జగన్ స్పష్టంచేశారు. అమరావతి రైతులను అన్యాయం చేయనని, రైతులకు న్యాయం చేస్తానని జగన్.. చెప్పగా సభ్యులు బల్లచరిచి మద్దతు తెలిపారు. ఇక్కడి రైతులు ఇస్తానని చెప్పిన పరిహారాన్ని 10 సంవత్సరాల పరిహారాన్ని 15 ఏళ్లకు పెంచుతున్నానని ప్రకటించారు. పెన్స‌న్‌ను కూడా రూ.2500 నంచి 5 వేలకు పెంచుతున్నామని చెప్పారు. దీంతో 21 వేల మందికి న్యాయం జరుగుతోందన్నారు.

జిల్లాతో అనుబంధం..

జిల్లాతో అనుబంధం..


సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలంటే రాజధానికి లక్షకోట్లు కేటాయించలేమని జగన్ పేర్కొన్నారు. అమరావతిపై తనకు కోపం ఉంటే లేజిస్లేటివ్ క్యాపిటల్ ఎందుకు ఉంచుతానని చెప్పారు. కృష్ణా జిల్లాకు తమ మేనత్తను ఇచ్చానని గుర్తుచేశారు. జిల్లాపై తనకు కోపం లేదన్నారు. తమకు ఇక్కడ థియేటర్లు కూడా ఉన్నాయని చెప్పారు.

తప్పుడు ప్రచారం

తప్పుడు ప్రచారం

అంతేకాదు కులం పేరుతో తప్పుడు అపాదిస్తున్నారని జగన్ విమర్శించారు. తమ పార్టీలో కమ్మలు ఉన్నారని, తన రాజకీయ పనులు పర్యవేక్షించేది కొడాలి నాని అని చెప్పారు. తన రాజకీయ కార్యదర్శి రఘు కూడా కమ్మ అని పేర్కొన్నారు. అమరావతిలో కమ్మ వాళ్లు ఉన్నారని తప్పుడు ప్రచారం చేశారని.. విశాఖలో వైసీపీ ఎంపీ కమ్మ అని చెప్పారు. గ్రామ సచివాలయ నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయ నిర్మిస్తామని జగన్ స్పష్టంచేశారు.

English summary
if middle in capital city delhi also change ap cm jagan mohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X