అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో భూములు కొనుగోలు చేసిన నేరమే, రాజధానిలో ఇల్లులేనిదే చంద్రబాబుకే: మంత్రి బొత్స

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌పై మంత్రి కొడాలి నాని స్పందించారు. కేసులు వేసేదీ చంద్రబాబు నాయుడే.. వాదనలు వినిపించేదీ, ఓడించేదీ కూడా ఆయనే అని విమర్శించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారు.

విశాఖలో కొనుగోలు చే్తే..

విశాఖలో కొనుగోలు చే్తే..


పయ్యావుల కేశవ్ కామెంట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఒకవేళ విశాఖలో భూములు కొనుగోలు చేస్తే తప్పేనని చెప్పారు. తమ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కొనుగోలు చేసినా తప్పేనని... దానిని తాను సభలో ప్రస్తావిస్తున్నానని చెప్పారు. రాజధానిలో పయ్యావుల కేశవ్ ఇల్లు కట్టుకుంటామని చెప్తున్నారు. ఓకే కానీ 4 ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్నించారు. 4 వేల నుంచి 5 వేల గజాల భూమి ఎందుకో చెప్పాలన్నారు. రాజధాని ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి.. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకుందామని అనుకొన్నారని చెప్పారు.

చంద్రబాబు ఒక్కరే..

చంద్రబాబు ఒక్కరే..

రాజధానిలో ఇల్లు కట్టుకోనిది ఎవరైనా ఉన్నారంటే అదీ చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. మిగతా నేతలంతా రాజధానిలో ఇల్లు కట్టుకున్నారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్‌లో ఇల్లు ఉంటుందని, అమరావతిలో ఉండదన్నారు. చరిత్రలో చంద్రబాబు నాయుడు హీనంగా మారిపోతారని చెప్పారు.

సుప్రీంకోర్టులో కేసు

సుప్రీంకోర్టులో కేసు


అంతకుముందు అమరావతి రాజధానికి సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన కేసును కూడా పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బందులు తలెత్తుతాయని, వేల కోట్ల ప్రజాధనం వృథా చేస్తున్నారని, రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతోందని, నిపుణుల కమిటీకి వ్యతిరేకంగా ముందుకెళ్తారని అందులో పేర్కొన్నారని పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు.

కొట్టివేసిన ధర్మాసనం

కొట్టివేసిన ధర్మాసనం

7-10-2014లో వేసిన పిటిషన్‌ను ముగ్గురు సభ్యులు గల సర్వోన్నత ధర్మాసనం తోసిపుచ్చిందని పేర్కొన్నారు. ఇదే కాదు రీజనల్ బోర్డు ఏర్పాటు కూడా విఫలప్రయోగం అని పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. ఇదివరకు సీఎంలుగా పనిచేసిన వెంగళ్ రావు, వైఎస్ఆర్ అమలు చేశారని, విఫలమైందని పేర్కొన్నారు. రాజధాని మార్పుపై ధైర్యం ఉంటే చెప్పాలని, ముసుగేసి, రంగులేసి చెప్పడం సరికాదన్నారు.

English summary
if minister buy a land in vizag also Criminal activity minister botsa satyanarayana said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X