అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చున్నీలపై ట్వీట్ వార్: నెటిజన్‌కు దిమ్మతిరిగే ఆన్సర్, పతీతలైపోతారా అంటూ టీడీపీ అనిత ధ్వజం

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ మహిళా నేత అనిత.. మరోసారి నెటిజన్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. చున్నీ, వాలంటీర్ వ్యవస్థ, దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై కూడా స్పందించారు. అయితే అమరావతి రాజధాని మార్పుపై చేసిన ఉద్యమంలో కొందరు మహిళా నేతలు చున్నీ వేసుకోలేదని.. వారి కులాన్ని ఆపాదిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి అనిత కూడా అదేస్థాయిలో రియాక్షన్ ఇచ్చారు. ఆశకు హద్దు ఉండాలి.. మీకు సిగ్గుండాలి అని ఘాటు వ్యాఖ్యలతో నెటిజన్ పోస్ట్ మొదలయ్యింది.

పిల్లలు పుట్టాక చున్నీ లేకుండా..

ఉద్యమం తప్పు అని ఎవరూ అనరని.. కానీ పిల్లలు పుటగ్టాక కూడా.. చున్నీలు లేకుండా ఉద్యమం చేయడం మాత్రం తప్పు అని పోస్ట్ చేశారు. అదీ మీ కులాలకు మాత్రమే చెల్లిందని ఘహాట్ కామెంట్స్ చేశారు. కాళ్లు, పాదాలు కనిపించకుండా బూట్లు తొడిగి.. శరీర సౌష్టవాలను ఎందుకు ప్రదర్శిస్తున్నారు.. సిగ్గుపడాలి బ్రమరావతి కమ్మ బొమ్మలు అని పోస్ట్ చేశారు. ముందు మీరు ఆడవాళ్లలా ఉండటం నేర్చుకోవాలని సూచించడంతో.. టీడీపీ అనిత అదేస్థాయిలో రియాక్షన్ ఇచ్చారు. అతని మైండ్ బ్లాంకయ్యేలా ఆన్సర్ ఇచ్చారు.

చున్నీ వేసుకోకుంటే పతీతలై పోతారా..?

చున్నీలు వేసుకోకపోవడంపై నెటిజన్ కామెంట్‌పై అనిత అదేస్థాయిలో స్పందించారు. చున్నీ వేసుకోకపోతే పతీతలు అయిపోతారని కులాలు ఎత్తి మరీ మాట్లాడటం మంచి పద్ధతి కాద్నారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు కొందరు చిల్లర బతుకు నుంచి పాలెగార్ల, ప్యూడల్ భావన నుంచి బయటకు రావడం లేదన్నారు. మీ ఇంట్లో.. మీ నేత ఇంట్లో మహిళలు చున్నీ వేసుకోకపోతే ఇలానే మాట్లాడతారా అని ప్రశ్నించారు. వారిని అలా.. మిగతా వారిని మరొలా చూడటం భావ్యం కాదన్నారు. థూ మీ బతుకులు చెడా అంటూ కామెంట్ చేశారు. ఇకనైనా మారాలని సూచించారు.

2 లక్షలు దాటిన కరోనా కేసులు.. మరీ వాలంటీర్లు ఏరీ..

మరోవైపు ఏపీ ప్రభుత్వంపై అనిత విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కరోనా కంట్రోల్ గురించి.. బ్రిటిష్ ప్రధాని కూడా నోరు తెరచుకుని చూశారని కుశారుగా అని మండిపడ్డారు. మరీ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటిందని వివరించారు. ఇదీ వాలంటీర్ల పనికి నిదర్శనమా అని అడిగారు. కేసులు పెరుగుతోన్న మన వాలంటీర్లు ఎక్కడ అని ప్రశ్నించారు.

Recommended Video

చరిత్ర సృష్టించిన కర్ణాటక సీఎం కుమారస్వామి...!
చంద్రబాబు, కేశినేని నానికి క్రెడిట్ వస్తోందని..

చంద్రబాబు, కేశినేని నానికి క్రెడిట్ వస్తోందని..


దుర్గమ్మ ఫ్లై ఓవర్ ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రభుత్వాన్ని అనిత ప్రశ్నించారు. అయితే ఫ్లై ఓవర్ వెనక చంద్రబాబు, కేశినేని నాని కృషి ఉంది అని హర్ట్ అయ్యి ప్రారంభించకుండా ఉండొద్దని సూచించారు. అలా చేయొద్దని.. ప్రారంభించాలని కోరారు. లేదంటే ఫ్లై ఓవర్ మారుద్దాం అని అనుకోకండి సూచించారు. అలా చేస్తే మిమ్మల్ని విజయవాడ ప్రజలు క్షమించారని తెలిపారు.

English summary
tdp anitha slams netizen for not wear duppatta comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X