వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ వార్నింగ్: అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే గుర్తింపు రద్దు

|
Google Oneindia TeluguNews

ప్రైవేట్ పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అవసరమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. వాస్తవానికి రాష్ట్రంలో స్కూళ్లు మూసివేసే ఉన్నాయి. వైరస్ తగ్గితే పాఠశాలలను ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు విద్యార్థుల అడ్మిషన్లపై ఇప్పటినుంచే ఫోకస్ చేశాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా అడ్మిషన్ల కోసం టీచర్లను విద్యార్థుల ఇళ్లకు పంపించే ప్రయత్నం చేస్తుంది. విషయం తెలిసిన విద్యాశాఖ ఆగ్రహాం వ్యక్తం చేసింది.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో

పాఠశాలలు ప్రారంభమైతే ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల తీరుపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆర్ కాంతారావు.. కమిషన్ వైస్ చైర్ పర్సన్ విజయ శారద రెడ్డి, కార్యదర్శి సాంబశివా రెడ్డి, కమిషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు సిబ్బంది జీతాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధిస్తున్నారనే అంశంపై డిస్కషన్ జరిగింది. వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నందున ఇది సరికాదని.. సదరు స్కూల్/ కాలేజీ గుర్తింపు రద్దు చేసేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

ఫిర్యాదు చేయండి

ఫిర్యాదు చేయండి

ఏ విద్యాసంస్థలో ఇలాంటి ఘటనలు జరిగితే apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అలాగే ఫీజును టీసీలకు ముడిపెట్టొద్దని స్పష్టంచేసింది. ప్రైవేటు స్కూళ్ల గుర్తింపు, రెన్యూవల్‌కు సంబంధించి జివో ఎంఎస్ నంబర్ 1ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సీబీఎస్సీ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కమిటీ సూచించింది.

Recommended Video

Bihar Lightning : పిడుగుల వానతో ఏకంగా 83 మంది మృతి, పెను విషాదం...!! || Oneindia Telugu
ఇవీ సూచనలు

ఇవీ సూచనలు


డిప్యుటేషన్ల రద్దు, స్పోకెన్ ఇంగ్లీష్ అమలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరత ఉందని కమిటీ డిస్కషన్ చేసింది. రాష్ట్రంలో పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్ మీద పనిచేస్తున్నారని తెలిపింది. వీరిని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. టీవీ మాధ్యమంగా ప్రసారం చేస్తున్న పాఠాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చేర్చాలని కమిటీ అభిప్రాయపడింది. చర్చించిన అంశాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదించారు.

English summary
andhra pradesh government warn to private schools. if private schools harass teachers for admission licence will be cancel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X