వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్ కోల్పోయిన శిల్పా: పార్టీ మారకపోతే ఆ పదవి చక్రపాణిదే

శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపికి రాజీనామా చేయకపోతే మండలి ఛైర్మెన్ పదవి దక్కేదని టిడిపి నేతలంటున్నారు.ఎమ్మెల్సీ పదవిని కూడ చక్రపాణిరెడ్డి త్యాగం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిలోనే కొనసాగితే శాసనమండలి ఛైర్మెన్ పదవి దక్కేదనే అభిప్రాయాన్ని పలువురు టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. మండలి ఛైర్మెన్ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవిని కూడ ఆయన కోల్పోవాల్సి వచ్చిందని టిడిపి నేతలు చెబుతున్నారు.

అఖిలప్రియకు 'శిల్పా' షాక్: కుటుంబసభ్యులతో రాజీనామాపై , 'ఆట మొదలైంది'అఖిలప్రియకు 'శిల్పా' షాక్: కుటుంబసభ్యులతో రాజీనామాపై , 'ఆట మొదలైంది'

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా కర్నూల్ జిల్లా రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకొన్నాయి.

if silpa chakrapani reddy continues in tdp, he will nominate as a chairmen of council

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి శిల్పా చక్రపాణిరెడ్డి సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టిడిపిలో అవమానాలు జరగడంతో తట్టుకోలేక తాను కూడ పార్టీని మారుతున్నానంటూ చక్రపాణిరెడ్డి కూడ వైసీపీలో చేరారు.

నంద్యాల బై‌పోల్: పవన్ మద్దతు ఎవరికీ, నేడు కీలక నిర్ణయంనంద్యాల బై‌పోల్: పవన్ మద్దతు ఎవరికీ, నేడు కీలక నిర్ణయం

Recommended Video

Nandyal By Polls : Balakrishna Road Show | Oneindia Telugu

వీరిద్దరూ కూడ నెలరోజుల క్రితం వరకు టిడిపిలోనే ఉన్నారు. అయితే శిల్పా చక్రపాణిరెడ్డికి మండలి చైర్మెన్ పదవిని ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారని టిడిపి నేతలు గుర్తుచేస్తున్నారు.

వైసీపీలో చేరడానికి ముందు ఎమ్మెల్సీ పదవికి కూడ రాజీనామా చేయాలని జగన్ సూచించడంతో చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి ఈ నెల 3వ, తేదిన రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఈ నెల 15వ, తేదిన ఆమోదం పొందింది.

వైసీపీలో చేరడంతో మండలి చైర్మెన్ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవిని కూడ చక్రపాణిరెడ్డి కోల్పోవాల్సి వచ్చిందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పదవికాలాన్ని కూడ వదులుకొని రాజీనామా చేయడం కూడ సాహోసోపేతమైన నిర్ణయమనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరడంతో తారుమారయ్యాయనే అభిప్రాయాన్ని పలువురు టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేసి ఆమోదించుకోవడం, వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు వైసీపీకి మంచి అస్త్రం దొరికినట్టైంది.

English summary
If Silpa Chakrapani reddy continues in Tdp, He will nominate as a chairmen of council said Tdp leaders. Shilpa resignation approval his mlc post Aug 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X