వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాసన మండలి రద్దు జరిగితే ... ఆ ఇద్దరు మంత్రులకు పదవీ గండం

|
Google Oneindia TeluguNews

ఏపీ లో శాసనమండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందనీకుండా జరిగిన హైడ్రామా పై వైసీపీ గుర్రుగా ఉంది. రాజ్యాంగ బద్దంగా మండలి సమావేశం జరగలేదని, ప్రజాస్వామ్య యుతంగా నిర్ణయం తీసుకోలేదని , ఇక అలాంటి మండలి అవసరమా ? రద్దు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉంది వైసీపీ సర్కార్ . అందుకోసం సోమవారం నాడు పూర్తి స్థాయి చర్చ జరిపి రద్దుకు ఓటింగ్ నిర్వహించాలని భావిస్తుంది. ఒక వేళ అదే జరిగితే, శాసన మండలి రద్దు అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కూడా కొన్ని చిక్కులు తప్పవు అని అర్ధం అవుతుంది . ఇద్దరు మంత్రులకు మండలి రద్దు అయితే పదవీ గండం పొంచి ఉంది .

మండలి రద్దు నిర్ణయం.. వైసీపీ నేతలకు షాక్ ఇచ్చే నిర్ణయమే

మండలి రద్దు నిర్ణయం.. వైసీపీ నేతలకు షాక్ ఇచ్చే నిర్ణయమే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవులను నమ్ముకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. వారంతా మండలి రద్దు జరిగితే రాజకీయ నిరుద్యోగులుగా మిగులుతారు. ఇక ఇప్పుడు ఈ విషయం కూడా వైసీపీని కాస్త ఇబ్బంది పెడుతుంది. చాలా మంది నేతలు ఎమ్మెల్సీ ఆశలతో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన వారు, ఎన్నికల్లో పోటీ చేయని వారు ఎమ్మెల్సీగా అయినా జగన్ అవకాశం ఇస్తారని వేచి చూస్తున్న వారు లేకపోలేదు. ఇక అలాంటి వారందరికీ మండలి రద్దు నిర్ణయం మింగుడు పడటం లేదు .

కేబినెట్లో ప్రస్తుతం ఇద్దరు మంత్రులకు మండలి రద్దుతో పదవీ గండం

కేబినెట్లో ప్రస్తుతం ఇద్దరు మంత్రులకు మండలి రద్దుతో పదవీ గండం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో ప్రస్తుతం ఇద్దరు మంత్రులకు శాసనమండలి రద్దు జరిగితే పదవీ గండం పొంచి ఉంది. ఆ ఇద్దరు మంత్రులు కూడా ఎమ్మెల్సీ హోదాలతోనే మంత్రులుగా ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకటరమణలు ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయిన ఒకదశలో వారు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా వారిని మంత్రులను చేశారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలు .. మంత్రులు

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలు .. మంత్రులు

అప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీగా ఉండగా ఆయన మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇక మంత్రి పదవి ఇచ్చాక మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్సీగా చేశారు జగన్ మోహన్ రెడ్డి . దీంతో ఎమ్మెల్సీ హోదాలతో మంత్రి పదవులను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయంతో మండలి రద్దు అయితే వారికి ఇబ్బంది తప్పని పరిస్థితి. వారు మంత్రి పదవులను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. వెంటనే కాకున్నా ఆరు నెలల్లో అయినా వారు మంత్రి పదవులను వీడాల్సి ఉంటుంది.

రద్దు జరిగితే ఇద్దరు క్యాబినెట్ నుండి అవుట్

రద్దు జరిగితే ఇద్దరు క్యాబినెట్ నుండి అవుట్

ఇక ఇంత ఉపద్రవం పొంచి ఉన్నప్పటికీ మండలిని రద్దు చేయాలని శాసనసభలో ప్రసంగించారు పిల్లి సుభాష్ చంద్రబోస్. మండలి రద్దుకు ఆయన ప్రతిపాదన చేశారు. అలాగే మోపిదేవి కూడా మండలి రద్దు చెయ్యాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఒకింత షాకింగ్ అంశమే. కాబట్టి మండలి రద్దు అయితే ఇద్దరు మంత్రులకు పదవీ గండమే కాదు రాజకీయంగా ఎమ్మెల్సీ పదవులు వస్తాయని నిరీక్షిస్తున్న అధికార పక్ష నాయకులకు షాక్ ఇచ్చినట్టే అవుతుంది.

English summary
The debate over the repeal of the Legislative Council in the AP Legislature appears to be a countdown to the dissolution of the Council.YS Jagan Mohan Reddy is currently in the Cabinet when two ministers cancel the legislative session. The two ministers are also MLCs. Pilli Subhash Chandra Bose and Mopidevi Venkataramana contested the recent elections and lost. However, YS Jagan Mohan Reddy, recognized their contributions to the party, gave them ministerial posts. Losing MLAs made ministers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X