అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని విభజన నిర్ణయం సరైనదైతే.. దొడ్డిదారిన అసెంబ్లీ దేనికి .. ఈ నిర్బంధాలు దేనికి : నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

రాజధాని అమరావతి పోరులో భాగంగా నేడు అసెంబ్లీ ముట్టడి నిర్వహించాలని భావించారు . అయితే నేడు అసెంబ్లీ సమావేశాల్లో జగన్ రాజధానిపై తుది నిర్ణయం వెల్లడించాలి అని భావిస్తున్న నేపధ్యంలో ,అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పిన వారిని పోలీసులు హౌస్ అరెస్ట్ లు, అరెస్ట్ లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని రద్దుకు సర్కార్ రెడీ.. మూడు రాజధానులు , యూపీ మోడల్ లో నాలుగు జోన్లుగా ఏపీ !!రాజధాని రద్దుకు సర్కార్ రెడీ.. మూడు రాజధానులు , యూపీ మోడల్ లో నాలుగు జోన్లుగా ఏపీ !!

మా నాయకులు చేసిన తప్పేంటి ? శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు .రాజధాని ప్రజలు ఆరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నారని పేర్కొన్న లోకేష్ రాజధాని గ్రామాల్లో పోలీసుల లాఠీఛార్జీలు, ముళ్ల కంచెలతో ఉద్యమాన్ని అణచివేయలేరని ఫైర్‌ అయ్యారు. రాజధాని ఉద్యమాన్ని వైసీపీ ప్రభుత్వం ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకి పదింతలు ఉద్యమం ఉధృతం అవుతుందన్నారు.

If the partition decision of capital is correct.. why these arrests are .. :Nara lokesh

మూడు రాజధానుల ప్రతిపాదన గొప్ప నిర్ణయమని వైసీపీ నాయకులు డప్పు కొడుతున్నారు..నిర్ణయం అంత గొప్పది అయితే సీఎం జగన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు లోకేష్‌. అంతేకాదు 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అని నిలదీశారు. నిన్నటికి నిన్న రాజధాని రైతులను చంపిన పాపం జగన్ సర్కార్ దే అన్న లోకేష్ చేసేవి దొంగపనులు కావడంతో గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారని, ప్రజల మధ్యలోంచి కాకుండా దొంగదారిలో వెళ్లేందుకు జగన్ కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ప్రభుత్వం రాజధాని అమరావతిని తరలించాలని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్‌ చేశారు.

English summary
What have our leaders done? Lokesh is outraged that the government has been given the right to protest peacefully. The YCP government is trying to destroythe right to protest peacefully for the capital movement. government is trying to control the movement with arrests and house arrests .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X