వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకే .. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆక్రోశం

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరుగుతున్నారు. నాలుగు రోజుల్లో ముగ్గురు బీసీ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు నమోదు చేశారని చంద్రబాబు ఆరోపించారు. బీసీ నాయకుల పై జగన్ కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక నేరస్తులే పాలకులు అయితే నిరపరాధులంతా జైలుకే అన్న వ్యాఖ్యలు ఏపీలో అక్షర సత్యాలని చంద్రబాబు పేర్కొన్నారు.

బీసీలపై సీఎం జగన్ అక్కసుకు తాజా అక్రమ కేసులు నిదర్శనం

బీసీలపై సీఎం జగన్ అక్కసుకు తాజా అక్రమ కేసులు నిదర్శనం


వైసీపీ అరాచకాలపై రాజీలేని పోరాటం చేస్తున్న టిడిపికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేసిన చంద్రబాబు బీసీలపై సీఎం జగన్ అక్కసుకు తాజా అక్రమ కేసులు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై అక్రమ కేసులు పెట్టడాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇక అంతే కాదు సోషల్ మీడియా వేదికగా స్పందించిన చంద్రబాబు టిడిపి నేతలపై పెడుతున్నవి తప్పుడు కేసులు అని చెప్పడానికి పలు వీడియోలను కూడా పోస్ట్ చేశారు.

పబ్లిక్ గా ఇలా చేస్తున్న వాళ్ళు తెర వెనుక ఇంకెన్ని చేస్తున్నారో

పబ్లిక్ గా ఇలా చేస్తున్న వాళ్ళు తెర వెనుక ఇంకెన్ని చేస్తున్నారో

తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇక్కడ లారీ యజమానులు స్పష్టంగా వేరే వ్యక్తి పేరు చెబుతుంటే, ఒక గౌరవనీయమైన ఎంపీ స్థానంలో ఉన్నాయన ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు అంటూ ఎగదోస్తున్నారని ఒక వీడియోను పోస్ట్ చేశారు చంద్రబాబు. ఇక అంతే కాదు విలేకరుల సమావేశంలో పబ్లిక్ గా ఇంత కుట్ర చేసిన వాళ్ళు తెర వెనుక ఇంకెన్ని చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి అంటూ చంద్రబాబు మరో పోస్ట్ పెట్టారు.

ఈ బరితెగింపుకు ప్రజలే సరైన సమాధానం చెప్తారు

ఈ బరితెగింపుకు ప్రజలే సరైన సమాధానం చెప్తారు


ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమే అంటూ మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీ సొంత కక్షసాధింపు వాడుకోవడం నేరమంటూ నిప్పులు చెరిగారు ఇక ఈ బరితెగింపుకు ప్రజలే సరైన సమాధానం చెబుతారు సిద్ధంగా ఉండండి అంటూ చంద్రబాబు నాయుడు వైసిపి నేతలపై, వైసిపి ప్రభుత్వ తీరుపై, టిడిపి నేతల అక్రమ అరెస్టులపై భగ్గుమన్నారు. ప్రజలు టీడీపీకి అండగా నిలబడాలని కోరిన చంద్రబాబు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

Recommended Video

AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ చూసుండరు ?
నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఇలాగే ఉంటది

నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఇలాగే ఉంటది


ఒక అవినీతిపరుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావం. ఇప్పుడు ఏపీలో వై ఎస్ జగన్ చేస్తుంది ఇదే అని చంద్రబాబు మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చెయ్యటం అన్యాయమని , కేవలం రాజకీయ కక్ష సాధింపు అని అన్నారు చంద్రబాబు.

English summary
Former CM Chandrababu Naidu is outraged on government rule in AP. Chandrababu alleged that three BC ministers had filed false cases in four days. Chandrababu is furious that the Jagan is torturing the BC leaders. Chandrababu said that if the rulers are criminals, all the innocents are in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X