విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి....లోకేష్

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షలో పాల్గోన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.... ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తనపై దమ్ముంటే కేసులు పెట్టండని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వానికి తాను మూడు డిమాండ్లు పెడుతున్నానని లోకేష్ చెప్పారు. ఇసుకు కార్మికుల ఆత్మహత్యను ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని అన్నారు. ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇక ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి నెలకు పదివేల రుపాయాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 If you dare Arrest me... Lokesh

ఐదు నెలలుగా కొరత ఉందని దీంతో... ప్రతి కుటుంబానికి యాబైవేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసి గత ప్రభుత్వంలో ఉన్న విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇతర రాష్టాల్లోని లేని ఇసుకు కొరత ఒక్క ఏపిలోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఏపీ నుండి వెళ్లిన లారీ ఇసుకు హైదారాబాద్ , బెంగళూరులో లక్ష రుపాయలకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఇసుక మాఫియాతో కార్మికులు ఇబ్బందులు పడుతుున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
police are arresting who spoke against the government nara lokesh said. if government dares asked to arrest him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X