హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పారాహుషార్: మీరు ఆ కాయలు తిన్నాక డ్రైవింగ్ చేస్తే ఇక నేరుగా జైలుకేనేమో!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఈ కాయలు తిని డ్రైవింగ్ చేస్తే మీరు ఫసక్ ! | Oneindia Telugu

విజయవాడ/హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం అనే విషయం తెలిసిందే. మందు తాగి డ్రైవింగ్ చేస్తే శిక్ష తప్పదు. సాధారణంగా మద్యం తాగి వాహనం నడుపుతూ బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పట్టుబడితే 35 పాయింట్లు దాటితే జైలు శిక్షతో పాటు వాహనం సీజ్ చేయాలని నిబంధనలు ఉన్నాయి.

అయితే, మీరు మందు తాగితేనే కాదు, ఓ పండు తిని డ్రైవింగ్ చేసినా కూడా బ్రీత్ ఎనలైజర్‌లో రీడింగ్ ఎక్కువగానే చూపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని స్వయంగా పోలీసులే పరిశీలించారు.

ఈ వీడియోలో.. ఓ పోలీసు తొలుత బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు సున్నా (జీరో) పాయింట్లు వస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న రేగు పండ్లు తీసుకొని తింటారు. ఓ రెండు మూడు పంట్లు తింటారు. ఆ తర్వాత మరోసారి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేసుకుంటారు.

అప్పుడు రీడింగ్ 550కు వెళ్తుంది. సాధారణంగా మద్యం తాగితేనే 100, 200 ఇలా వస్తుంది. కానీ రెండు మూడు రేగు పండ్లు తిన్నందుకే 550 రీడింగ్ వచ్చింది. దీనిని చూసి పోలీసులే ఆశ్చర్యపోతారు. ఇదెక్కడి పరిస్థితి నాయనా అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల 2018 తొలి మూడు నెలల్లోనే 1300 మందికి పైగా జైలు పాలయ్యారు. మొత్తంగా దాదాపు ఏడు వేల కేసులు నమోదయ్యాయి. ఆ తొలి మూడు నెలల్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 52 లైసెన్స్‌లు రద్దయ్యాయి. 539 డ్రైవింగ్ లైసెన్స్‌లు మూడు నెలల నుంచి అయిదేళ్లపాటు సస్పెండ్ అయ్యాయి.

If you eat this fruit you will surely booked in drunk and drive case

2014, 2015, 2016లలో డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ కాలేదు. కానీ 2017లో మాత్రం 203 సస్పెండ్ అయ్యాయి. కేవలం ఈ ఏడాది మార్చి నెలలోనే 13 లైసెన్స్‌లు రద్దయ్యాయి. 92 డ్రైవింగ్ లైసెన్స్‌లు ఏడాది పాటు, 55 డ్రైవింగ్ లైసెన్స్‌లు రెండేళ్ల పాటు సస్పెండ్ అయ్యాయి. 19 డ్రైవింగ్ లైసెన్స్‌లు మూడేళ్ల పాటు రద్దయ్యాయి.

English summary
If you eat this fruit you will surely booked in drunk and drive case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X