గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనామ్ కొనుగోళ్లకు ఒత్తిడి చేస్తే...తెలంగాణా వెళతాం:ఎపి మిర్చి వ్యాపారుల హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు మిర్చి యార్డులో మిర్చి కొనుగోళ్ల వివాదం మరో మలుపు తిరిగింది. రైతుల ఆందోళనతో మొదలైన ఈ వివాదం ఆ తరువాత అధికారులు-వ్యాపారుల మధ్య విబేధాలకు దారితీసింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఈ నామ్ పద్దతి అమలు చేసి తీరాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తుండగా...అలా బలవంతంగా ఈ నామ్ కొనుగోళ్ల కోసం ఒత్తిడి తెస్తే...మిర్చి కొనుగోళ్ల కోసం గుంటూరు మార్కెట్ యార్డ్ వదిలి తెలంగాణా, మహారాష్ట్ర మార్కెట్లకు వెళ్లిపోతామని మిర్చి వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
దీంతో ఏం చెయ్యాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

గుంటూరు మిర్చియార్డ్ వివాదం...రైతుల ఆందోళనతో మొదలు

గుంటూరు మిర్చియార్డ్ వివాదం...రైతుల ఆందోళనతో మొదలు

గుంటూరు మిర్చియార్డ్ లో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారంటూ మూడు రోజుల క్రితం మిర్చి రైతులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దీంతో మిర్చియార్డులో విభేధాల విషయం వెలుగు చూసింది. ఈ వివాదం విషయం లోతుగా విచారణ చేస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-నామ్‌ విధానమే ఈ వివాదానికి మూల కారణమని తెలిసింది. రైతుల ఆందోళనతో ఈ వివాదం వెలుగులోకి రావడంతో పాటు తరువాత ఏం జరుగుతుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. కారణం ఈ ఈ-నామ్ పథకాన్ని కేంద్రప్రభుత్వం గుంటూరు మిర్చి యార్డ్ లో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తుండటంతో అధికారులకు ఈ విధానాన్ని అమలు చేయడం తప్పనిసరిగా మారింది.

తరువాత ఏం జరిగిందంటే...త్రిముఖ పోరాటంగా మారింది...

తరువాత ఏం జరిగిందంటే...త్రిముఖ పోరాటంగా మారింది...

గుంటూరు మిర్చి యార్డ్ లో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడం వల్లే రైతులు ఆందోళనకు దిగారు. తదనంతరం ఈ వివాదం రైతులు-వ్యాపారులు-అధికారులు ఇలా త్రిముఖ పోరుగా మారింది...ఎలాగంటే అధికారులేమో మిర్చి వ్యాపారులు కొనుగోళ్లు జరిపి తీరాలని, రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. వ్యాపారులేమో ఈ-విధానంలో తాము కొనుగోళ్లు జరపలేమని, ఆ విధానం తీసి పాత పద్దతి పెడితే మిర్చి కొంటామని స్పష్టం చేస్తున్నారు. అధికారులేమో ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని, తాము చేయగలిగిందేమీ లేదని, కేంద్రం మోడల్ ప్రాజెక్ట్ గా గుంటూరు మిర్చి యార్డ్ లో ఈ నామ్ విధానం అమలు చేస్తున్నందున...అది తప్పనిసరిగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చి చెబుతున్నారు.

వ్యాపారుల వాదనేమిటంటే...ఆ కారణాలివే...

వ్యాపారుల వాదనేమిటంటే...ఆ కారణాలివే...

అయితే గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి కొనుగోళ్లకు సంబంధించి ఈ వివాదంపై వ్యాపారుల వాదనేమిటంటే...తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ-నామ్ విధానంలో కొనుగోళ్లు జరపలేమని, అందుకు బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు. రైతుల నుంచి మిర్చి కొనుగోళ్లు చేస్తే..వాటికి తక్షణమే డబ్బు చెల్లించాల్సి రావడం ఒక కారణమైతే, రెండు ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్ లో ఈ నామ్ విధానానికి తగినట్లుగా సాంకేతిక ఏర్పాట్లు లేకపోవడం అని వ్యాపారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల గురించి అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఈ పరిస్థితుల్లో మిర్చి కొనుగోళ్లు జరపలేమని తేల్చి చెబుతున్నారు.

తాజా పరిస్థితి ఏంటంటే?...కొనసాగుతున్న ప్రతిష్టంభన...

తాజా పరిస్థితి ఏంటంటే?...కొనసాగుతున్న ప్రతిష్టంభన...

వ్యాపారులు ఈ నామ్ విధానం పై తమ వ్యతిరేకత తెలియజేసిన క్రమంలో గుంటూరు మిర్చి యార్డ్ లో కొనుగోళ్లపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ఈ-నామ్‌ను అమలు చేసి తీరాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ యార్డ్ అధికారులకు స్పష్టం చేసిన నేపథ్యంలో...తదనంతరం మిర్చి ఎగుమతి, దిగుమతి అసోసియేషన్లు, లైసెన్స్‌ వ్యాపారులతో జెడి రామాంజనేయులు, సెక్రటరీ శ్రీనివాస్‌ శనివారం సమావేశమయ్యారు. అయితే ఈసమావేశం ఈ-నామ్‌పై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసింది.

 ఒత్తిడి చేస్తే పక్క రాష్ట్రాలకు...వ్యాపారుల హెచ్చరికలు

ఒత్తిడి చేస్తే పక్క రాష్ట్రాలకు...వ్యాపారుల హెచ్చరికలు

ఈ నామ్ విధానంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇంత చెప్పినా కాదు కూడదని...ఎపి అధికారులు ఈ విధానం బలవంతంగా అమలు చెయ్యాలని చూస్తే తాము ఈ ఈ-నామ్‌ అమలులో లేని తెలంగాణ, మహారాష్ట్ర మార్కెట్లకు వెళ్లిపోతామని మిర్చి వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. తాము ఈ-నామ్‌ అమలుకు వ్యతిరేకం కాదని, ముందు ఈ విధానం అమలుకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని పునరుద్ఘాటించారు. గుంటూరు మిర్చి యార్డ్ లో ఈ-నామ్‌ ప్రకారం కొనుగోళ్లు జరపాలంటే ప్రతిరోజూ యార్డుకు రూ.40 కోట్ల సరుకు వస్తుందని, అయితే తాము రూ.10 కోట్ల సరుకు కంటే ఎక్కువ కొనలేమని వ్యాపారులు చెబుతున్నారు. తమ దగ్గర డబ్బు ఉన్నంత వరకే కొనగలం కానీ డబ్బు లేకుండా కొనుగోళ్లు ఎలా జరుపుతామని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తమ సమస్యలు తీసుకువెళ్లి మరోసారి సమావేశమయ్యాక నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.

English summary
The stalemate continues on Mirchi purchase in Guntur Mirchi Yard. While the traders objecting the e-NAM system, but the authorities have made it clear that the policy introduced by the Center should be implemented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X