నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థిని ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

suicide
నిజామాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థిని స్రవంతి సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. 18 ఏళ్ల గురజాల స్రవంతి బాసర ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మడలం బడాభీంగల్ గ్రామంలోని తన నివాసంలో ఈ ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో స్రవంతి సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు ఆ అఘాయిత్యానికి ఒడిగట్టింది. మంటలను ఆర్పి ఆమెను రక్షించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.

ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలి దేహంతో ఆస్పత్రిలో చేరిన స్రవంతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పది రోజుల క్రితం తమ కూతురు స్రవంతి ఇంటికి వచ్చిందని, ఇతరులతో మాట్లాడడం మానేసిందని తల్లిదండ్రులు భూదేవి, రాజాగంగారాం చెప్పారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటిలో వేధింపుల కారణంగానే స్రవంతి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
A third-year engineering student of IIIT, Basara, Gurajala Sravanthi,18, committed suicide by setting herself blazing herself at her residence at Badabheemgal village of Bheemgal mandal early on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X