visakhaptnam vizag andhra university ganta srinivasa rao iim విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం గంటా శ్రీనివాసరావు ఐఐఎం
ప్రపంచ స్థాయికి విశాఖ ఐఐఎం: ప్రారంభోత్సవంలో మంత్రి గంటా(పిక్చర్స్)
విశాఖపట్నం: ప్రపంచస్థాయి విద్యా సంస్థగా విశాఖ ఐఐఎంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఐఐఎం విశాఖలో తరగతులను మంత్రి గంటా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఐఐఎం విశాఖను మిగిలిన ఐఐఎంల కన్నా మిన్నగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సిఎం చంద్రబాబునాయుడు చొరవ వల్ల ఐఐటి, ఐసర్, నిట్, ట్రిపుల్ ఐటి, కేంద్ర విశ్వవిద్యాలయం వంటి ఏడు జాతీయ స్థాయి విద్యా సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. వీటిలో ఐదు విద్యా సంస్థలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.
విశాఖ ఐఐఎంను ఎంపిక చేసుకున్న విద్యార్థులను మంత్రి గంటా అభినందించారు. భవిష్యత్లో మల్టీ నేషనల్ కంపెనీలు విశాఖకు రానున్నాయని, విశాఖ ఐఐఎంలో చదివిన తొలి బ్యాచ్ విద్యార్థులకు వీటిలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఆయన తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ఐఐఎం డీన్ (ప్రాజెక్ట్స్) సౌరవ్ ముఖర్జీ, డైరెక్టరేట్ ప్రతినిధి పునీత్ కౌర్, డీన్ (ప్రోగ్రామ్స్) ఆఫీస్ ప్రతినిధి సుధారావు, విశాఖ ఐఐఎం పరిపాలనాధికారి చంద్రశేఖరరావు, జిల్లా కలెక్టర్ యువరాజ్, స్టీల్ ప్లాంట్ సిఎండి మధుసూదనరావు, తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ భవాని, ఎయు వైస్ ఛాన్స్లర్ జిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ ఐఐఎం ప్రారంభోత్సవం
ప్రపంచస్థాయి విద్యా సంస్థగా విశాఖ ఐఐఎంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

విశాఖ ఐఐఎం ప్రారంభోత్సవం
ఐఐఎం విశాఖలో తరగతులను మంత్రి గంటా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విశాఖ ఐఐఎం ప్రారంభోత్సవం
ఐఐఎం విశాఖను మిగిలిన ఐఐఎంల కన్నా మిన్నగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

విశాఖ ఐఐఎం ప్రారంభోత్సవం
సిఎం చంద్రబాబునాయుడు చొరవ వల్ల ఐఐటి, ఐసర్, నిట్, ట్రిపుల్ ఐటి, కేంద్ర విశ్వవిద్యాలయం వంటి ఏడు జాతీయ స్థాయి విద్యా సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. వీటిలో ఐదు విద్యా సంస్థలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.

విశాఖ ఐఐఎం ప్రారంభోత్సవం
పారిశ్రామిక రాజధానిగా విశాఖ గుర్తింపు పొందిందని, దీనికి కావల్సిన నిపుణులను అందించేందుకు ఐఐఎం కూడా ఇక్కడే ఏర్పాటు కావడం ముదావహమని గంటా అన్నారు.

విశాఖ ఐఐఎం ప్రారంభోత్సవం
విశాఖ ఐఐఎంను ఎంపిక చేసుకున్న విద్యార్థులను మంత్రి గంటా అభినందించారు.

విశాఖ ఐఐఎం ప్రారంభోత్సవం
భవిష్యత్లో మల్టీ నేషనల్ కంపెనీలు విశాఖకు రానున్నాయని, విశాఖ ఐఐఎంలో చదివిన తొలి బ్యాచ్ విద్యార్థులకు వీటిలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఆయన తెలియచేశారు.

విశాఖ ఐఐఎం ప్రారంభోత్సవం
ఇక్కడి విద్యార్థులను ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఐఐఎం డైరక్టర్ సుశీల్ వాచాని తెలిపారు.