• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భర్త మృతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ..ఆమెనే చంపి పిల్లల్ని అనాధలు చేసిన దారుణం

|

భర్త మృతితో ఇద్దరు పిల్లలతో బతుకీడుస్తున్న ఓ మహిళ వేరే వ్యక్తిని నమ్ముకుంది. ఆ వ్యక్తిపై ఆమె పెట్టుకున్న నమ్మకమే ఆమె పాలిట శాపమైంది. తనకు తన పిల్లలకు అండగా ఉంటాడనుకుంటే, అనుమానంతో ఆమెనే హతమార్చాడు సదరు ప్రబుద్ధుడు. ఇక వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా తొండంగి గ్రామానికి చెందిన 23 ఏళ్ల అరుణకు కొద్ది రోజుల క్రితం భర్త మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న అరుణ ఇంటి పక్కనే ఉన్న శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతను తన కుటుంబానికి అండగా నిలుస్తాడని నమ్మింది.

ఇక అరుణ బతుకు దెరువుకోసం అన్నవరంలోని హరిణి బోటు షికారులో పనిచేస్తోంది. కొంతకాలం పాటు సాగిన వేరి వివాహేతర సంబంధం వ్యవహారంలో క్రమక్రమంగా మనస్పర్థలు వచ్చాయి. ఆమె వేరే ఎవరితోనో దగ్గరగా ఉంటుందని శ్రీను ఆమెను వేధించసాగాడు. ఇక ఇదే క్రమంలో అన్నవరంలోని బోటు షికారు లో పనిచేస్తున్న అరుణను అక్కడి నుండి బయటకు తీసుకు వెళ్లి తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను నదిలోకి తోసి చంపేశాడు. ఇక ఈ నెల రెండో తేదీ నుంచి కనబడకపోయేసరికి కుటుంబ సభ్యులు తొండంగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Illegal affair draged a widower to the death

స్థానికులకు శ్రీను పై అనుమానం రావడంతో అతనిని ప్రశ్నించగా కానీ అరుణ ని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. అంతేకాదు అరుణ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్య చేశానని చెప్పాడు. సంఘటనా స్థలానికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పేశాడు . ఇక ఈ ఘటనతో అటు తండ్రి లేక, ఇటు తల్లి హత్యకు గురి అరుణ ఇద్దరు బిడ్డలు అనాధలయ్యారు. తనకు తన బిడ్డలకు అండగా ఉంటాడని అరుణ తీసుకున్న తప్పుడు నిర్ణయం చివరకు ఆమె జీవితాన్ని బలి చేసింది. ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులు లేని బిడ్డలుగా , అనాథలుగా మార్చింది. ఇక అరుణను హతమార్చిన శ్రీను జైలు పాలయ్యాడు .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Aruna named widower currently working on the Harini boat cruise in Annavaram . she maintained extramarital relationship with srinu . a Over the course of a long period of time, there has been a gradual breakthrough in extramarital affairs. Srinu harassed her that she was close to someone else and she was taken out and hit hard. He then dumped her into the river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more