వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ వేళ ఏపీలో కొనసాగుతున్న అక్రమ దందాలు.. పోలీసులకు ఇదో పరేషాన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో లాక్ డౌన్ సమయంలోనూ అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. ఒక పక్క పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేస్తున్నా అక్రమార్కులు మాత్రం మారటం లేదు . నిత్యం ఏదో ఒకటి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరుకుతున్నారు. ఇక మద్యం షాపులు బంద్ కొనసాగుతున్న నేపధ్యంలో లిక్కర్ అక్రమ దందా జోరుగా సాగుతుంది . అంతే కాదు అక్రమ రేషన్ బియ్యం రవాణా, అలాగే గంజాయి దందా కూడా యధేచ్చగా కొనసాగుతుంది . ఇక తాజాగా జరుగుతున్న పలు ఘటనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

లాక్ డౌన్ వేళ.. మీ వాహనాలు భద్రం .. సీజ్ అయితే చుక్కలే లాక్ డౌన్ వేళ.. మీ వాహనాలు భద్రం .. సీజ్ అయితే చుక్కలే

తిరుపతిలో గంజాయి గ్యాంగ్ దాడులు

తిరుపతిలో గంజాయి గ్యాంగ్ దాడులు


తాజాగా తిరుపతిలో గంజాయి బ్యాచ్‌ చేసిన హంగామా గంజాయి జోరుగా దొరుకుతుంది అన్న దానికి సాక్ష్యంగా నిలిచింది . పీకే లే అవుట్‌లో గంజాయి మత్తులో ఇద్దరిపై దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. 10 రోజుల క్రితం వృద్ధురాలు, మరొకరిపై ఈ గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. ఈ గ్యాంగ్‌లోని ఇద్దరిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటన మాత్రమే కాదు గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి తీసుకున్న యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాన్ని బలిగొంది.

గుంటూరు జిల్లాలోనూ విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి

గుంటూరు జిల్లాలోనూ విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి


నందులపేటలో గుల్బర్గాకు చెందిన యువకులు కార్పెంటర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి తీసుకున్న యువకులు ఆ మత్తులో ఘర్షణకు దిగారు. దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే రాత్రికి రాత్రే మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థానికులు యత్నించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడి ఖననాన్ని అడ్డుకున్నారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించిన పోలీసులు ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఈ రెండు ఘటనలు గంజాయి దందాకు అద్దం పడుతున్నాయి.

Recommended Video

India Lockdown 2.0 : KCR To Take A Key Decision On April 20th Over Coronavirus Lockdown
గుంటూరు జిల్లాలో రేషన్ అక్రమ దందాను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో రేషన్ అక్రమ దందాను అడ్డుకున్న పోలీసులు

ఇక అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని కూడా వదలటం లేదు . గుంటూరు జిల్లాలోని శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ పట్టుబడింది. దాదాపు 20 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు కొందరు వ్యక్తులు యత్నించారు. కాగా ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో రేషన్ బియ్యం తరలింపును అడ్డుకున్నారు. 20 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనలు ఏపీలో జోరుగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయన్న దానికి నిదర్శనంగా నిలిచాయి.

English summary
Illegal business continue during AP lockdown. In corona tension also Something always smuggled in the state. Liquor continues to thrive in the wake of Bandh is ongoing trend of liquor stores. Also, illegal ration rice business , as well as marijuana smuggling, continues. A number of recent events have brought this to light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X