వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా నుండి ఏపీకి .. విచ్చలవిడిగా అక్రమ మద్యం .. ఏపీలో లిక్కర్ లారీ పట్టివేత

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో లిక్కర్ ధరలు విపరీతంగా పెంచారు. దీంతో ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నా కారణంగా తెలంగాణ నుండి ఏపీకి మద్యం అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్నా మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు.

దొడ్డిదారిన మద్యం అక్రమ రవాణా .. రీజన్ ఇదే

దొడ్డిదారిన మద్యం అక్రమ రవాణా .. రీజన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కంటే 75 శాతం లిక్కర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీకి మద్యం తరలించడానికి కనిపించిన ప్రతి అడ్డదారి తొక్కుతున్నారు లిక్కర్ మాఫియా. తెలంగాణలో మద్యాన్ని ఏపీకి తరలించి అక్కడి ధరలతో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. బస్సుల్లో, కార్లలో ,కొరియర్ లో, టూవీలర్ ల మీద కూడా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున ఈ మాఫియా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

 మద్యం మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఈ బీ అధికారులు

మద్యం మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఈ బీ అధికారులు

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వస్తున్న వాహనాల మీద, పోలీసులు నిఘా పెట్టి వాహన తనిఖీలు చేస్తున్నా పోలీసుల కళ్లుగప్పి లిక్కర్ మాఫియా మద్యం రవాణా చేస్తూనే ఉంది. ఇక ఏపీ ఎస్ఈ బీ అధికారులు లిక్కర్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే ఉక్కుపాదం మోపుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇబ్బడిముబ్బడిగా లిక్కర్ ని పట్టుకున్న పోలీసులు, ఎస్ఈబీ అధికారులు లిక్కర్ మాఫియాపై కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు.

రొటీన్ గా మారిన లిక్కర్ దందా .. లారీ పట్టివేత

రొటీన్ గా మారిన లిక్కర్ దందా .. లారీ పట్టివేత


ఇంతగా నిఘా పెట్టి ఎక్కడికక్కడ రవాణా అవుతున్న అక్రమ మద్యాన్ని పట్టుకుంటున్నా, ఏపీకి లిక్కర్ అక్రమ రవాణా చేయడం లిక్కర్ మాఫియాకు రొటీన్ గా మారింది. తాజాగా తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా మద్యం తరలిస్తున్న లారీ పట్టుకున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. పక్కా సమాచారంతో జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున లిక్కర్ పట్టుబడింది. వీరులపాడు మండలం పెద్దాపురం వద్ద హైదరాబాద్ నుండి వస్తున్న లారీలో తనిఖీలు చేపట్టిన పోలీసులు, ఆ లోడ్ మొత్తం లిక్కర్ లోడ్ కావడంతో షాక్ తిన్నారు.

నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నా మారని మద్యం మాఫియా

నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నా మారని మద్యం మాఫియా

లారీ డ్రైవర్ పోలీసులకు నకిలీ పత్రాలు చూపించి, అక్కడినుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్ తో పాటు వాహనంలో ఉన్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. లిక్కర్ లోడ్ ను సీజ్ చేశారు. ఈ మద్యం ఎక్కడ నుండి రవాణా అవుతుంది అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మద్యం అక్రమ రవాణాపై చట్టాలను మరింత కఠినతరం చేసినా నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని చెప్పినా లిక్కర్ మాఫియా అవేవీ లెక్క చెయ్యటం లేదు .

English summary
alcohol illegal transportation from Telangana to Andhra Pradesh is rampant. Liquor prices have skyrocketed in the wake of AP CM Jagan Mohan Reddy taking steps towards abstinence. Due to the high rates of alcohol in the AP, the smuggling of alcohol from Telangana to the AP is rampant. Krishna district police have recently nabbed a lorry smuggling liquor from Telangana to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X