మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌కు ఏడాది జైలు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్‌కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అక్రమ ఆయుధాల వినియోగం కేసులో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించింది. భానుతోపాటు మరో ఇద్దరికి కూడా ఇదే కేసులో శిక్షను విధించింది. 2009లో అక్రమ ఆయుధాల కేసులో భాను కిరణ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ హత్య కేసుకు సంబంధించి గత ఐదేళ్లుగా భానుకిరణ్ జైల్లోనే ఉన్నాడు.












Click it and Unblock the Notifications