వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మెరుపు సమ్మెకు ఐఎంఏ పిలుపు, నిలిచిపోనున్న వైద్య సేవలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్పోరేట్, ఇతర ఆసుపత్రుల సిబ్బంది గురువారం నుండి సమ్మెకు దిగనున్నారు. దీంతో వైద్య సేవలను నిలిపివేయాలని కూడ ఐఎంఏ నిర్ణయం తీసుకొంది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టాన్ని ఏపీ రాష్ట్ర అసెంబ్లీ కూడ ఆమోదించింది.ఈ చట్టాన్ని ఐఎంఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కూడ సమ్మెలో పాల్గొనే అవకాశం కూడ లేకపోలేదని సమాచారం.

IMA decides to strike from april 5th in Ap state

సీఎం, మంత్రులకు తెలియకుండా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ఆమోదం పొందిందా అని ఐఎంఏ ప్రశ్నిస్తోంది. ఈ చట్టం ఏపీ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొంది. ఇంకా శాసనమండలిలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ తరుణంలో అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేయాలని ఐఎంఏ నిర్ణయం తీసుకొంది.

వైద్యుల తమ విధులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడాల్సిరావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమ్మెలో ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన సిబ్బంది, ఉద్యోగులు, వైద్యులు పాల్గొంటే పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు.

అయితే ఈ విషయమై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోంది. ఈ సమ్మె నిర్ణయంపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.

English summary
IMA decided that strike from april 5 in the Andhra pradesh state for Clinichal establishment act.IMA demanding government should intervene in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X