వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

29న మరో అల్పపీడనం - సీమతో పాటుగా కోస్తా జిల్లాలపైనా : భారీ వర్షాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

భారీ వర్షాలతో అతలాకుతలమైన సీమ జిల్లాల్లో ప్రస్తుతం ముప్పు తప్పింది. అదే సమయంలో మరో హెచ్చరిక జారీ అయింది. నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసినా.. అలాగే కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతుండడంతో అక్కడ భారీవర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం తప్పిన ముప్పు

ప్రస్తుతం తప్పిన ముప్పు

దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని, 28, 29 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రంలో 29వ తేదీనాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోందిని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 28 నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.

29న మరో అల్ప పీడనం

29న మరో అల్ప పీడనం

ఇదిలావుండగా ఈ నెల 29న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి, రెండు రోజు ల్లో పశ్చిమవాయవ్యంగా పయనిస్తుందని పేర్కొంది. దీంతో..28న రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇక, గురువారం రాత్రి తిరుపతిలో భారీ వర్షం కురిసింది. దీంతో..నగర వాసుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ప్రస్తుతానికి ముప్పు తప్పిందని అధికారులు చెప్పారు.

ఈ సారి సీమతో పాటుగా కోస్తా సైతం

ఈ సారి సీమతో పాటుగా కోస్తా సైతం


కానీ, ఈ నెల 29న ఏర్పడనున్న అల్పపీడనం తో మరోసారి భారీ వర్షాలు సీమ జిల్లాలతో పాటుగా కోస్తా జిల్లాల పైన ప్రభావం ఉంటుందనే హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. రేపు( 27వ తేదీ) ఉత్తర కోస్తా లో తేలికపాటి వర్షాలతో పాటుగా ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే చిత్తూరు..కడప..అనంతపురం..నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆరు వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
కేంద్రం నుంచి రంగంలోకి స్పెషల్ టీంలు

కేంద్రం నుంచి రంగంలోకి స్పెషల్ టీంలు

కేంద్రం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖలు రాసారు. దీంతో వెంటనే స్పందించిన హోం శాక నష్టం అంచనాకు కేంద్ర అధికారులను పంపందింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటుగా వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్రం నుంచి వచ్చిన అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 29న వారు సీఎం జగన్ తో భేటీ కానున్నారు.

English summary
The government is on high alert with warnings that heavy rains will once again affect the Seema districts as well as the coastal districts with low pressure to form on the 29th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X