• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాకినాడలో ఆయిల్ మాఫియా విజృంభణ...పలు పరిశ్రమల మూసివేత...తరలింపు

|

కాకినాడ: కాకినాడలో ఆయిల్‌ మాఫియా విజృంభణతో ఆయిల్‌ పరిశ్రమల యాజమాన్యాలు విలవిల్లాడుతున్నాయి. వారి ఆగడాలకు ఎలా అడ్డుకట్టవెయ్యాలో తెలియక ఏకంగా పరిశ్రమలే మూసేస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కాకినాడలో ఆయిల్ మాఫియా ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తరచూ ఆయిల్‌ దొంగతనాలు జరుగుతుండటం, పక్కా ప్లాన్ ప్రకారం భారీ స్థాయిలో ఆయిల్ దోపిడీలకు ఈ మాఫియా వ్యక్తులు తెగబడుతుండటంతో పాటు ఆయిల్ పరిశ్రమలో కొందరి గుత్తాధిపత్యం కారణంగా అనివార్యమవుతున్న నష్టాలు ఆయిల్ పరిశ్రమ యాజమాన్యాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీంతో కాకినాడలోని పెద్ద పెద్ద ఆయిల్ పరిశ్రమలే మూత పడుతుండగా, చాలా పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలివెళ్లిపోతున్నాయి.

 దిగుమతులు దిగువకు...

దిగుమతులు దిగువకు...

కాకినాడలో గతంలో రెండు లక్షల టన్నుల వరకు ఎడిబుల్ ఆయిల్‌ దిగుమతి అయ్యేది. అయితే ఇప్పుడు ఇప్పుడు కేవలం 70 వేల టన్నుల ఆయిల్‌ మాత్రమే దిగుమతి అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 పరిశ్రమల మూత...

పరిశ్రమల మూత...

వంట నూనెల తయారీకి సంబంధించి కాకినాడలో 11 ఆయిల్‌ పరిశ్రమలుంటే అందులో ఇటీవల కాలంలో ఆరు పరిశ్రమలు మూతపడ్డాయి. త్వరలో మరికొన్ని పరిశ్రమలు మూతపడే దశలో ఉన్నాయని స్థానిక ఆయిల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 నియంత్రణా వైఫల్యం...

నియంత్రణా వైఫల్యం...

ఈ పరిస్థితికి ప్రధాన కారణం రవాణాలో ఆయిల్ మాఫియా ఆగడాలను నిలువరించలేకపోవడమేనని స్థానిక వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. సరుకుకు రవాణా భద్రత లేకపోవడంతో ఎగుమతి, దిగుమతి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ట్యాంకర్ల దోపిడీ ఆగడాలను భరించలేక పైపులైన్ల ద్వారా ఆయిల్‌ రవాణాను చేపట్టినా వాటికీ రంధ్రాలు పెట్టి దొంగిలించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

 భద్రతా సిబ్బందిని పెట్టినా...

భద్రతా సిబ్బందిని పెట్టినా...

పైపులైన్లను కాపాడుకునేందుకు ఒక్కో ఆయిల్‌ కంపెనీ తరఫున ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించుకొని 24 గంటల పాటు గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. అయినా ఈ గస్తీ బృందాలను సైతం మాఫియా లోబరుచుకోవడం, భయపెట్టడం ద్వారా వారి కార్యక్రమాలను యథేచ్చగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గడచిన 18 నెలల్లో చోరీకి గురైన ఆయిల్ అఫీషియల్ గా 20 టన్నులని అంటున్నారని, కానీ అంతకంటే ఎక్కువే పోయివుంటుదని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కాకినాడ గ్రామీణం పరిధిలో పైపులైనుకు రంధ్రం చేసి ఆయిల్‌ చోరీ చేసిన ఘటనపై వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొదలు ఎప్పుడంటే...

మొదలు ఎప్పుడంటే...

సుమారుగా 2000 సంవత్సరం నుంచి కాకినాడలో ఆయిల్‌ మాఫియా ఆగడాలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రైవేటు పోర్టులొచ్చాక సరకు రవాణాలో ట్యాంకర్ల ఆధిపత్యం ఉండేది. దాన్నుంచి బయటపడేందుకు ఈ ప్రాంతంలో వంటనూనెల ఆయిల్‌ పరిశ్రమలను స్థాపించిన వ్యాపారవేత్తలు పైపులైన్ల ద్వారా ఆయిల్‌ రవాణాకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయిల్‌ మాఫియా ఆగడాలు పెరగడం, యూనియన్ల గొడవల వ్యవహారాల్లో హత్యలు జరిగేంతవరకూ పరిస్థితి వెళ్లింది.

 మాఫియాకు నేతల అండ...

మాఫియాకు నేతల అండ...

ఇటీవల కాకినాడ రూరల్ పరిధిలో ఇలాగే పైపులైనుకు రంధ్రం చేసి ఆయిల్‌ చోరీ చేసిన ఘటనపై వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారట.

అయితే మాఫియాకు మద్దతుగా వెంటనే రాజకీయ నేతలు నేరుగా రంగంలోకి దిగి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారులపై తీవ్ర ఒత్తిడి చేశారట. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితితో వ్యాపారులు బావురుమన్నారట. దీన్ని బట్టి ఆయిల్ మాఫియా ఇక్కడ ఎంతగా పాతుకు పోయిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

పోలీస్ శాఖకు మచ్చలు...

పోలీస్ శాఖకు మచ్చలు...

పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారులు ఈ వివాదాల్లో తలదూర్చి మచ్చలు తగిలించుకున్నారు. నవంబర్ నెల 28న ఆయిల్‌ దొంగతనం ఇందుకో ఉదాహరణ. ఆరోజు కాకినాడలో జరిగిన ఆయిల్ దొంతనానికి సంబంధించి పోలీసులు కొంతమందిని అరెస్టు చూపించారు. అందులో పైపునకు రంధ్రం చేసిన వారిని, లారీ డ్రైవర్లను, సంపు స్టోరేజీ నుంచి అమ్మిన వారిని, ఆఖరికి సంపు స్టోరేజీ గోదాం అద్దెకిచ్చిన వ్యక్తిని కూడా అరెస్టు చేసిన పోలీసులు దొంగ ఆయిల్‌ కొనుగోలు చేసిన వ్యాపారిని మాత్రం వదిలేశారు. ఈ పరిణామం పోలీసుల విచారణ తీరుపై సందేహాలకు తావిచ్చింది. గతంలో జిల్లాలో పనిచేసిన ఎస్పీకి, మరో పోలీసు అధికారికి మధ్య ఆయిల్‌ కారణంగా తలెత్తిన వివాదం అప్పట్లో పోలీసు శాఖ ప్రతిష్ఠను బాగానే దెబ్బతీసింది.

 కోట్ల రూపాయల ముడుపులు..

కోట్ల రూపాయల ముడుపులు..

ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయిల్‌ మాఫియాలో తలదూర్చుతున్న పోలీసులకు ఆయిల్‌ మాఫియా, నేతలకు అందించే మామూళ్లు కోట్లనే ఉంటాయనే ప్రచారం ఉంది. 15-20 సంవత్సరాల నుంచి సాగుతున్నఈ వ్యవహారం మధ్యలో అప్పుడప్పుడు కొంత కాలం బ్రేక్‌ పడటం మినహాయించి నిరాటంకంగానే కొనసాగుతోందని చెప్పవచ్చు.

మూత..తరలింపు..

మూత..తరలింపు..

ఈ విధంగా ఆయిల్ మాఫియా ఆగడాలు భరించలేని స్థాయికి చేరుకోవడం, ఈ పరిస్థితి మారే అవకాశం కనుచూపుమేరలో కనిపించక పోవడంతో పలు ఆయిల్ పరిశ్రమల యజమానులు తమ సంస్థలను మూసేసుకుంటున్నారు. అలా మూత వెయ్యలేనివారు ఎక్కువగా కృష్ణపట్నం పోర్టుకు, మరికొంత మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి అంతటికి కారణం ఆయిల్ మాఫియా చేస్తున్నదొంగతనాలే కారణమని, ఎన్నో ఏళ్లుగా ఆయిల్ ను దొంగిలిస్తున్నా పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే పరిశ్రమలు తరలిపోయే స్థితి ఏర్పడుతోందని సాక్షాత్తూ కాకినాడ పోర్టు డైరెక్టర్ కోయా ప్రవీణ్ చెప్పడం ఇక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది.

English summary
kakinada is famous for edible oil industry. Crores of rupees business went here through dible oil. But now the situation has changed. The conditions that are not favorable for oil business because of oil mafia. Kakinada Port, which imported two lakh tonnes of edible oil per year, has now fallen to 70,000 tonnes. Now only five companies are doing edible Oil business in Kakinada. Some companies have shut down. Some other companies have moved from Kakinada port to Krishnapatnam port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X