ఏపీలోని రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

సౌత్ వెస్ట్ రైల్వేజోన్ లో జరుగుతున్న ట్రాక్ పనులవల్ల కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దుచేశారు. ఇంకొన్ని రైళ్లను దారిమళ్లించారు. బెంగళూరు-ధర్మవరం-బెంగళూరు (06595/06596) రైలును ఏప్రిల్‌ 3, 10 తేదీల్లో రద్దు చేశారు. ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో వీటిని గౌరిబిదనూరు-ధర్మవరం సెక్షన్‌లో రద్దుచేసి గౌరిబిదనూరు-బెంగళూరు మధ్య నడుపుతున్నారు.

జైపూర్‌-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12976) రైలును ఏప్రిల్‌ 1, 8 తేదీల్లో గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా రద్దుచేసి గుంతకల్లు, బళ్లారి, రాయదుర్గం, అరిసికెరె, హసన్‌ స్టేషన్ల మీదుగా దారి మళ్లించారు. ట్రాక్‌ మరమ్మతు పనుల వల్ల కలబురగి-బెంగళూరు-కలబురి ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22231/22232) రైలును ఏప్రిల్‌ 3, 10 తేదీల్లో ఐదున్నర గంటల ఆలస్యంగా, అలాగే తిరుగు ప్రయాణంలో కూడా ఐదున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

Important note for train passengers in AP

రైళ్ల రద్దీ ఎక్కువవుతుండటంతో మెరుగైన సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లను కూడా భారతీయ రైల్వే ఏర్పాటు చేస్తోంది. కొన్ని స్టేషన్ల మధ్య ఇప్పటికే ఉన్న డబుల్ ట్రాక్ పక్కన త్రిబుల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-గూడూరు మధ్య రైళ్ల రద్దీ తీవ్రంగా ఉంటోంది. వీటిని నియంత్రించాలంటే మూడోలైను ఒక్కటే పరిష్కారమని అధికారులు సూచిస్తున్నారు. దీంతో భారతీయ రైల్వే కూడా సాధ్యమైనంతవరకు వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.

రాయలసీమలోని పలు నగరాలను అమరావతికి చేరువ చేయాలనే ఉద్దేశంతో రైల్వే అధికారులు గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, గిద్దలూరు, కర్నూలు మీదగా పలు రైళ్లను నడుపుతున్నారు. ఇవే కాకుండా కోల్ కతా, భువనేశ్వర్, పూరీ, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం వైపు నుంచి రాయలసీమకు ఎక్కువ రైళ్లను నడుపుతున్నారు. వీటితోపాటు అదనపు రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+