వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 ఎన్నిక‌ల్లో టీడిపి మార్పు తేవ‌డం ఖాయం.. మోడీకి గుణ‌పాఠం చెబుతాం..

|
Google Oneindia TeluguNews

అమ‌వ‌తిలో జ‌రుగుతున్న మ‌హానాడు ప్రారంభ ఉప‌న్యాసంలో చంద్ర‌బాబు ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో మోదీ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లం చెందింద‌ని మండిప‌డ్డారు. 2019 ఎన్నిక‌లు మోదీ ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం చెబుతాయ‌ని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని బాబు తెలిపారు.

ఇచ్చిన హామీలు మ‌రిచిన మోదీ.. మూల్యం చెల్లిస్తారు...

ఇచ్చిన హామీలు మ‌రిచిన మోదీ.. మూల్యం చెల్లిస్తారు...

మ‌హానాడు వేదిక‌గా భారతీయ జ‌న‌తా పార్టీ పైన‌ మ‌రోసారి చంద్ర‌బాబు విరుచుకు ప‌డ్డారు. తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా హామీలు ఇచ్చి విస్మ‌రించ‌డం మోడీకే చెల్లింద‌ని ఎద్దేవా చేశార���. విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న మ‌హానాడు కార్య‌క్ర‌మానికి విచ్చేసిన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహా ప్ర‌సంగాన్ని చేశారు చంద్ర‌బాబు. స్థానిక సమ‌స్య‌ల‌ను కాద‌ని కేవ‌లం కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన విధానాన్ని ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బిజెపి వ్య‌వ‌హ‌రించిన తీరును, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బిజెపి వ్య‌వ‌హ‌రించిన తీరును వివ‌రించే ప్ర‌య‌త్నం చేశ��రు చంద్ర‌బాబు. లోటు బ‌డ్జెట్ లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటామ‌ని చెప్పి..... ఆ త‌ర్వాత ప‌ట్టించుకోక పోవ‌డం ప్ర‌ధాని మోడీకి ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీల‌తో హ‌వా అని పేర్కొన్నారు.

రాష్ట్ర అవ‌స‌రాల‌ను ఎన్నోసార్లు గుర్తు చేసా... కేంద్రం విన‌లేదు..

రాష్ట్ర అవ‌స‌రాల‌ను ఎన్నోసార్లు గుర్తు చేసా... కేంద్రం విన‌లేదు..

ప్రాంతీయ పార్టీల‌న్నీ ఏక‌మై రెండు జాతీయ పార్టీల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్ప‌బోతున్నాయ‌న్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు దేశంలో అనేక మార్పుల‌కు నాంది ప‌లుక‌బోతున్నాయ‌ని జోస్యం చెప్పారు.రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అమ‌లు కావాల్సిన హామీల గురించి ప్ర‌ధాని మోడీని ఎన్నోసార‌ల్లు సంప్ర‌దించినా స్పంద‌న క‌నిపించ‌లేద‌న్నారు. కావాల‌నే తిరుప‌తిలో వివాదాల��ను ర‌గిల్చి తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింద‌ని మండి ప‌డ్డారు. ఇచ్చిన హామీల‌నునెర‌వేర్చి రాష్ట్రాన్నిఆదుకోవాల్సింది పోయి క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం బిజెపికి స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

తెలుగు ప్ర‌జ‌ల మ‌ద్య చిచ్చు పెట్ట‌డానికి అమీత్ షా ప్ర‌య‌త్నాలు.. అడ్డుకుని తీరుతాం...

తెలుగు ప్ర‌జ‌ల మ‌ద్య చిచ్చు పెట్ట‌డానికి అమీత్ షా ప్ర‌య‌త్నాలు.. అడ్డుకుని తీరుతాం...

మ‌హానాడుకు త‌ర‌లి వ‌చ్చిన పార్టీ శ్రేణులు ఊహించిన‌ట్లుగా చంద్ర‌బాబు ప్ర‌సంగం జాతీయ స్థాయిలో కొనసాగింది.కేంద్ర ప్ర‌భుత్వం పెత్తం దారి వ్య‌వస్థ‌ను చూస్తూ స‌హించేదిలేద‌ని, ప్ర‌ధాన మంత్రుల‌ను నిర్దేశించింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. 2019 లో ప్రాంతీయ పార్టీల‌న్నీఏక‌మై స‌త్తాచాటే అవ‌కావం ఉంద‌ని చెప��పారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి , ప‌వ‌న్ కళ్యాణ్ లాంటి నేత‌ల‌ను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం నాట‌కాలు ఆడే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, అంతే కాకుండా తెలుగుదేశం పార్టీని దెబ్బ‌తీసేందుకు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు. 2019లో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రించ‌డం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న మోడీ ప్ర‌భ��త్వం ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి ఏంఒర‌గ‌బెట్టిందో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వ తీరు వ‌ల్లే ఏపీ వెనుక‌బ‌డి పోతుందని ఆవేద‌న వ్య‌క్తంచేశారు బాబు.

మోదీ ప‌థకాల వ‌ల్ల ఒరిగిందేమిటి.. నిర్వీర్య‌మైన బాంకింగ్ రంగం...

మోదీ ప‌థకాల వ‌ల్ల ఒరిగిందేమిటి.. నిర్వీర్య‌మైన బాంకింగ్ రంగం...

ఢిల్లీలో ప్ర‌ధానిమోడీని29 సార్లు సంప్ర‌దించినా పెద్ద‌గా స్పందించ‌లేద‌ని గుర్తు చేశారు. బిజెపి ప్ర‌బుత్వానికి గుణ‌పాఠం చెప్పాలంటే 2019 ఎన్నిక‌ల‌నే అస్త్రాలుగా ఉప యోగించుకునేందుకు కార్య‌క‌ర్త‌లు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. బిజెపి కుట్ర‌పూరిత రాజ‌కీయాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని 2019 ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌న్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పా ర్టీ దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు. ప్ర‌ధానిమోడీ ఇచ్చిన హామీలు పార్ల‌మెంట్ గేట్లు కూడా దాట‌ట‌డం లేద‌���ి జిఎస్టీ, నోట్ల ర‌ద్దు వ‌ల్ల ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోగా....సామాన్యుల‌పై భారం ప‌డింద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో విప‌ల‌మైన భార‌తీయ జ‌నతాపార్టీకి రాబోయే ఎన్నిక‌లే గుణపాఠం చెబుతాయ‌ని అన్నారు.

English summary
telugudesham party national president chandrababu naidu targetted prime minister modi in mahanadu event in vijayavada. babu alleged that modi forgotten the assurances which was given in state bifurcation time. chandrababu said in 2019 tdp will going to play crucial in the central government. telugu people will give lession to bjp in 2019 election babu said at his opening speech in mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X