వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

94 శాతం ఏపీ ఎమ్మెల్యేలు కరోడ్‌పతులే .. ఆస్తుల్లో బాబు ఫస్ట్, జగన్ సెకండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఫలితాల్లోనే కాదు అభ్యర్థుల ఆస్తుల విషయంలో రికార్డు సాధించారు. రాష్ట్రంలో 94 శాతం మంది ఎమ్మెల్యేలు కోటిశ్వరులే ఉండి ధనవంత సభ్యులుగా రికార్డు సృష్టించారు. ఈ విసయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ (ఏడీఆర్) సంస్థ ప్రకటించింది.

163 మంది కోటీశ్వరులే ..

163 మంది కోటీశ్వరులే ..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికైన 163 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ సంస్థ పేర్కొంది. వీరిలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువమంది ఉండటం గమనార్హం. ఒక్క ఎమ్మెల్యే సగటున ఆస్తి రూ.27.87 కోట్లుగా ఉందని సంస్థ ప్రకటించింది. అంటే ఏపీ ప్రజాప్రతినిధులు దాదాపు కోటిశ్వరులే. కేవలం 12 మంది మాత్రమే కోటికి తక్కువ ఆస్తి ఉన్న ప్రజాపత్రినిధులు ఉన్నారు.

 బాబు ఫస్ట్ ... జగన్ సెకండ్

బాబు ఫస్ట్ ... జగన్ సెకండ్

ఆస్తుల్లో మాజీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి రూ.668 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ప్రతి ఏటా చంద్రబాబు తన ఆస్తులను ప్రకటిస్తున్నారు. తర్వాత కాబోయే సీఎం జగన్ రూ.510 కోట్లతో సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు. మొత్తంగా వైసీపీ నుంచి 140 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేల ఆస్తి రూ.కోటిపైగానే ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. వాస్తవానికి తెలంగాణ నుంచి విడిపోయిన ఏపీ .. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కానీ నేతల ఆస్తులు మాత్రం పెరగడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఓ వైపు రాష్ట్రాన్ని ఆదుకోవాలని నేతలు విజ్ఞప్తి చేస్తూ .. మరోవైపు తమ ఆస్తులను పెంచుకోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. ఏపీ నేతల ఆస్తులు పెరిగాయనే విషయాన్ని ఏడీఆర్ సంస్థ బట్టబయలు చేసింది.

రూ.18 కోట్లు పెరిగిన ఆస్తులు

రూ.18 కోట్లు పెరిగిన ఆస్తులు

2014లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతల ఆస్తి రూ.18.01 కోట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో తమ ఆస్తి రూ.29.97 కోట్లని వారు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు. ఇప్పుడు అది రూ.47.99 కోట్లకు చేరిందని ఏడీఆర్ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. ఇక వీరిలో పేద ఎమ్మెల్యేగా నాగులపల్లి ధనలక్ష్మీ నిలిచారు. ఆమె తన ఆస్తులను రూ.6.75 లక్షలుగా చూపించారు. ఈమెతోపాటు మరో 11 మంది కూడా కోటీలోపే ఆస్తి కలిగి ఉన్నారు. వీరు తప్ప మిగతా నేతలంతా కరోడ్ పతులే కారణం విశేషం.

English summary
The AP Assembly has been recorded in the case of candidates' assets. 94 per cent of the MLAs in the state were made up of rich people. announced by Association for Democratic Reformers (ADR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X