వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక అడుగు.. దేశంలోనే తొలిసారి.. చదవాల్సిందే..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 20లక్షలు దాటగా, కోలుకున్నవాళ్లు 5లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు చేరువైంది. మనదేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే కేసుల సంఖ్య 12వేలకు, మరణాల సంఖ్య 400కు దగ్గరయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కేసుల సంఖ్య 500 దాటగా, 11 మంది చనిపోయారు. బుధవారం రాత్రి వరకు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. మహమ్మారి విజృభణ మొదలైనప్పటి నుంచీ డాక్టర్లు, నర్సులు, వైద్య సహాయ సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. చాలా చోట్ల వైద్య సిబ్బంది నిద్రాహారాలు లేకుండా కష్టపడుతున్నారు. ఏపీలో కొంతలో కొంతైనా ఆ భారాన్ని తగ్గించే దిశగా సీఎం జగన్ కీలక అడుగు వేశారు.

కొత్త డాక్టర్ల నియామకం..

కొత్త డాక్టర్ల నియామకం..

ప్రస్తుతానికి దేశమంతటా కొనసాగుతున్నట్లే ఏపీలోనూ కొవిడ్-19 కేసులను పూర్తిగా ప్రభుత్వమే పర్యవేక్షిస్తున్నది. ఏపీలో కరోనా డెడికేటెడ్ ఆస్పత్రులతోపాటు పడకల సౌకర్యం ఉన్న అన్ని చోట్లా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైసీపీ సర్కారు గతంలోనే ఆదేశించింది. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో సిబ్బందిపై పనిభారం పెరిగింది. దీంతో ప్రైవేటు డాక్టర్లు, మెడికల్ పీజీ పూర్తిచేసినవాళ్ల సేవల్ని కూడా వాడుకుంటామని సీఎం జగన్ చెప్పారు. ఆమేరకు కొత్తగా 592 మంది డాక్టర్లను నియమించుకునే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. కొవిడ్-19 నేపథ్యంలో అధికారికంగా డాక్టర్ల నియామకాన్ని చేపట్టిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

నెల జీతం రూ.1లక్షపైనే..

నెల జీతం రూ.1లక్షపైనే..

కరోనా నేపథ్యంలో డాక్టర్ల స్పెషల్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి ఏపీ వైద్య విద్య విభాగం డైరెక్టర్ డాక్టర్ కే వెంకటేశ్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. జనరల్ మెడిసిన్, పల్మనాలజీ విభాగంలో 400, అనస్థీషియాలజీ స్పెషలిస్టు పోస్టులు 192.. మొత్తం కలిపి 592 పోస్టుల్ని కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేయనున్నట్లు, బుధవారం (15 నుంచి) ఈనెల 19 వరకు http://dme.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. స్పెషలిస్టులకు నెలకు రూ.1.10లక్షలు, జనరల్, పల్మనాలజీ డాక్టర్లకు నెలకు రూ.53,945 వేతనం చెల్లిస్తామని, ఏడాదిపాటు కాంట్రాక్ట్ ఉంటుందని, రిజర్వేషన్లతోపాటు ప్రభుత్వ నిబంధనలన్నీ వర్తిస్తాయని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నవారికి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో సవలందిస్తున్నవారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

ఎంతమంది మెడికల్ స్టాఫంటే..

ఎంతమంది మెడికల్ స్టాఫంటే..


ప్రభుత్వం అందుబాటులో ఉంచిన డేటా ప్రకారం ఏపీలోని 13 జిల్లాల్లో కలిసి మొత్తం 4,799 మంది ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారు. నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది సంఖ్య 16,481గా ఉంది. కొత్తగా రిక్రూట్ కాబోయే 592 మందితో వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, తద్వారా సిబ్బందిపై ఒత్తిడి కొంతైనా తగ్గి, రోగులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదిలా ఉంటే..

నర్సింగ్ కాలేజీలు మూసివేత..

నర్సింగ్ కాలేజీలు మూసివేత..

ఓవైపు కొత్త డాక్టర్ల నియామక నోటిఫేషన్ జారీకాగా, మరోవైపు రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల మూసివేతకు ఆదేశాలు వెలువడ్డాయి. లాక్ డౌన్ కొనసాగింపు లేదా లాక్ డౌన్ 2.0కు సంబంధించి కేంద్ర హోం శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏపీలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కాలేజీలను మూసేయాలంటూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధవారం సర్క్యులర్ జారీచేశారు. అయితే ఫైనలియర్ విద్యార్థులకు మాత్రం కోర్సు పూర్తి చేసేందుు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Recommended Video

Fake News Buster : 05 కాణిపాకం గుడి క్వారంటైన్ సెంటరా ? బాంద్రా లో జరిగిన దానికి కారణం ఫేక్ న్యూస్

English summary
andhra pradesh govt, directorate of medical education issued recruitment notification for 592 doctor posts on contract base. amid covid-19 cases increasing in the state, cm jagan ordered to do so
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X