వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Exclusive:పవన్ కళ్యాణ్ కు షాకింగ్ : కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ ఎంట్రీ ఖాయం: ఆ ఇద్దరికీ ఛాన్స్...!

|
Google Oneindia TeluguNews

ఏపీ అధికార పార్టీ వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం ఖాయంగా కనిపిస్తోంది.పార్టీ నుండి రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో బీజేపీలోని కొందరు ముఖ్యులు ఈ అంశాన్ని చర్చించారనే సమాచారం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రిని కలిసిన సమయంలోనే ఈ నిర్ణయం ఖరారైందని తెలుస్తోంది.

లక్ష్మీ పార్వతికి అవమానం: లేని హోదా ఇచ్చారు..అధికారుల తిరస్కరణ: దిద్దుబాటు చర్యలు ప్రారంభం..!లక్ష్మీ పార్వతికి అవమానం: లేని హోదా ఇచ్చారు..అధికారుల తిరస్కరణ: దిద్దుబాటు చర్యలు ప్రారంభం..!

 వైసీపీ-బీజేపీ దోస్తీ

వైసీపీ-బీజేపీ దోస్తీ

కేంద్రంలో ప్రధాని మోడీ రెండో సారి అధికారం లోకి రావటం..ఏపీలో వైసీపీ 22 లోక్ సభ స్థానాలు సాధించి సభలోనే అతి పెద్ద నాలుగో పార్టీగా నిలిచింది. అయితే, కొద్ది కాలంగా ఈ ప్రచారం సాగుతున్నా...అటు బీజేపీ..ఇటు వైసీపీ మాత్రం దీనిని నిర్దారించ లేదు. ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం ముగుస్తుండటం..కేంద్రంలో సమీకరణాలు మారుతున్న వేళ..ఏపీకి భవిష్యత్ అసవరాలను పరిగణలోకి తీసుకొని వైసీపీ కేంద్ర కేబినెట్ లో చేరటం ఖాయమని తెలుస్తోంది.

అయితే, ఏపీలో జనసేన తో మైత్రి కొనసాగిస్తున్న బీజేపీ..ఇప్పుడు తమ వైసీపీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే సమాచారం పవన్‌కు షాక్ గా భావిస్తున్నారు. అదే జరిగితే పవన్ బీజేపీతో సైతం దూరం అవ్వటం ఖాయమని తెలుస్తోంది. అసలు ఇంతకీ..ఈ మొత్తం వ్యవహారంపైన ఢిల్లీలో ఏం జరుగుతోంది...వైసీపీ నుండి ఎవరికి అవకాశం దక్కనుంది..

కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ..

కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ..

2014 ఎన్నికల తరువాత టీడీపీ..బీజేపీతో పొత్తు..తరువాతి పరిణామాలతో రాజకీయంగా టీడీపీ నష్టపోయిన విధానంతో తాము జాగ్రత్తగా ఉండాలని తొలుత వైసీపీ భావించింది. అయితే, స్వయంగా బీజేపీ పెద్దల నుండే కేంద్ర కేబినెట్ లో చేరాలని ఆహ్వానం వచ్చినా..ముఖ్యమంత్రి జగన్ సమయం కావాలని కోరినట్లు తెలిసింది. ఇక, ఇప్పుడు అటు జాతీయ స్థాయిలో..ఇటు ఏపీలో మారుతున్న సమీకరణాలతో కేంద్ర కేబినెట్ లో చేరాలనే ప్రతిపాదన స్వయంగా కేంద్రంలో రెండో స్థానంలో ఉన్న నేత నుండి ముఖ్యమంత్రికి అందినట్లు విశ్వసనీయ సమాచారం.

అయితే, ఎన్‌ఆర్‌సీ..ఎన్‌పీఆర్ వంటి అంశాల్లో తొలుత పార్లమెంట్‌లో సమర్ధించినా..ఇప్పుడు ఏపీలో అమలు చేయమని జగన్ స్పష్టం చేశారు. ఇక, ఇదే సమయంలో ఏపీలో పవన్ తో బీజేపీ జత కట్టటంతో వైసీపీలో ఆలోచన మారినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఆర్దిక పరిస్థితులు..అనివార్యంగా మారిన కేంద్ర సాయం..ఇతరత్రా సమస్యలతో కేంద్ర కేబినెట్ లో చేరటం వలనే నష్టం లేదనే అభిప్రాయంతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

 జగన్ సైతం సంకేతాలు...ఆ ఇద్దరికే ఛాన్స్..

జగన్ సైతం సంకేతాలు...ఆ ఇద్దరికే ఛాన్స్..

తాజాగా రాజ్యసభ సభ్యులు నామినేషన్ల దాఖలు సమయంలోనే ముఖ్యమంత్రి జగన పరోక్షంగా ఈ సంకేతాలు ఇచ్చినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. అమిత్ షా సూచన..స్వయంగా అంబానీ అభ్యర్ధన మేరకు వైసీపీ నుండి రాజ్యసభకు నత్వానీని ఎంపిక చేసిన జగన్ ఆయన్ను స్వతంత్రంగా కాకుండా వైసీపీ సభ్యుడిగానే ఖరారు చేశారు. ఇదే సమయంలో ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి తొలి నుండి పార్టీకి..వ్యక్తిగతంగా జగన్ కు అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో ఆర్దికంగా సహకారం అందించారనే ప్రచారం పార్టీలో ఉంది.

దీంతో పాటుగా ఏపీలో ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు ముగిస్తే మరలా సార్వత్రిక ఎన్నికల వరకూ ఎన్నికల ప్రసక్తే లేదు. దీంతో..ఇక ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్రంలో భాగస్వామి అయితే..మరింతగా తన లక్ష్యాలను చేరుకోవచ్చని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో మైనార్టీలకు బీజేపీ నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను అండగా ఉంటానని..జగన్ హామీ ఇవ్వటం ద్వారా సమస్య ఉండదని అంచనా వేస్తున్నారు. ఇక, కేంద్ర కేబినెట్ లో వైసీపీ నుండి ఇప్పటి వరకు విజయ సాయి రెడ్డి పేరు వినిపిస్తుండగా..తాజాగా అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే విధంగా మూడో బెర్తు అవకాశం ఉంటే కాపు లేదా ఎస్సీ వర్గం నుండి మహిళా ఎంపీకి ఛాన్స్ దక్కనుంది.

Recommended Video

AP Local Body Elections: Janasena Bjp Manifesto బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనా ?
పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు..

పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు..

ప్రచారం సాగుతున్నట్లుగా వైసీపీ కేంద్ర కేబినెట్ లో చేరటం ఖాయమైతే..బీజేపీతో బంధం కొనసాగించరాదని ఇప్పటికే పవన్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తమతో ఏపీలో పొత్తు కుదుర్చుకొని మరో వైపు ఢిల్లీ బీజేపీ పెద్దలు మాత్రం జగన్ తో సన్నిహితంగా ఉండటం..రాజ్యసభ సీట్లలో సర్దుబాట్లు పవన్ కు రుచించటం లేదు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా..రెండు పార్టీల అభ్యర్దుల గెలుపు మాత్రం పవన్ ఛరిష్మా మీదనే నమ్ముకొని ఉన్నారు.

దీంతో..పవన్ ఈ ఎన్నికల్లో తన పార్టీతో పాటుగా బీజేపీ అభ్యర్ధులను సైతం గెలిపించి తన సత్తా నిరూపించుకోవా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత ఏపీలో రాజకీయ ముఖచిత్రం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత కేంద్ర కేబినెట్ విస్తరణ ఖాయమనే సమాచారంతో..వైసీపీ చేరిక పైనా స్పష్టత రానుంది.

English summary
In a big Shock to Pawan Kalyan, if sources are to be believed YSRCP will join Modi's cabinet which would take place in the next month. Ayodhya Ramireddy who is nominated to Rajyasabha from YCP would be induces as Minister in Modi's cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X