• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ జీ.. మీ వల్ల చాలా సంతోషం - వార్డు సచివాలయాలు భేష్ - ఏపీ సీఎంకు ప్రధాని మోదీ కితాబు

|

ప్రతి నిత్యం లక్షకు సమీపంగా కొత్త కేసులు.. మొత్తంగా 57 లక్షల ఇన్ఫెక్షన్లు.. లక్షకు చేరువైన మరణాలు.. దేశంలో మొత్తం 700 జిల్లాలు ఉంటే.. ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లో మాత్రమే మహమ్మారి ఎఫెక్ట్ అతితీవ్రంగా ఉంది.. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు ఎలా వ్యవహరించాలి.. కరోనా కట్టడికి ఇంకా ఏమేం చర్యలు చేపట్టాలి.. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలి.. తదితర అంశాలపై చాలా సీరియస్ గా సాగిన సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి.. సీఎం కూర్చున్న చోటుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

తిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులు

అసలేం జరిగిందటే..

అసలేం జరిగిందటే..

కరోనా ప్రభావం అధికంగా ఉన్న.. కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ముఖ్యమంత్రులు తమ ఛాంబర్ల నుంచే సమావేశంలో పాల్గొనగా.. బ్రహ్మోత్సవాల్లో పొల్గొనేందుకు తిరుమల వెళ్లిన ఏపీ సీఎం అక్కడి నుంచే భేటీలో పాలుపంచుకున్నారు. జగన్ వెనకాలే శ్రీవారి చిత్రపటం ఉండటాన్ని ప్రధాని మోదీ గుర్తించారు..

మీ వల్ల దర్శనం అయిది..

మీ వల్ల దర్శనం అయిది..

తిరుమలలోని అన్నమయ్య భవన్‌ నుంచి సీఎం జగన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆ గదిలో శ్రీవారి చిత్రపటాన్ని చూసిన ప్రధాని.. ‘‘జగన్ జీ.. మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాకు శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం అయిందన్నత సంతోషం కలిగిస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో పాల్గొనడానికి వెళ్లి కూడా మీరు ఈ వీడియో కాన్ఫరెన్సలో పాల్గొనడం అభినందనీయం'' అని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా లోలోపలే గోవిందనామస్మరణ చేసుకున్నారు.

కరోనాపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు - ఏడు రాష్ట్రాల సీఎంలకు నిర్దేశం - తిరుమల నుంచే జగన్ హాజరు

గ్రామ, వార్డు సచివాలయాలపై మోదీ ఆరా..

గ్రామ, వార్డు సచివాలయాలపై మోదీ ఆరా..

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రులకు సూచించిన ప్రధాని మోదీ.. విపత్తు సమయంలో మందుల పంపిణీ, సరఫరాకు సంబంధించి రాష్ట్రాల మధ్య లోపాలు తలెత్తడం సరికాదని, ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. రాబోయే వారం రోజులపాటు సీఎంలు కరోనాపై కాన్ఫరెన్సులు నిర్వహించాలని, బ్లాక్ స్థాయి నుంచి లెక్కలు సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మోదీ ప్రస్తావించారు. ‘‘ఏపీలో మీరు(జగన్) అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. వారికి త్వరితగతిన సేవలన్నీ అందుతున్నాయి. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నాను'' అని ప్రధాని పేర్కొన్నారు.

English summary
while speaking in a video conference with chief ministers of the seven states worst-affected by the Covid-19, Prime Minister Narendra Modi made some intresting comments on andhra pradesh cm ys jagan. Modi said, "I am happy to see Sri Venkateswara Swamy with you through this video conference today." Speaking on a video conference from Annamayya Bhavan, AP CM YS Jagan said that the Prime Minister said so as there was a big picture of Swami behind him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X