వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రభుత్వానికి మొదటి సవాల్! ప్రభుత్వాసుపత్రుల్లో శిశువుల వరుస మరణాలు? ఆళ్లనాని ఇక్కడా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

వ‌ంద‌లాది శిశువులు మ‌ర‌ణిస్తున్నా... ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ ఏం చేస్తున్నాడు..? || Oneindia Telugu?

అమ్మ ఒడి అన్నారు. పిల్ల‌ల‌ను ఒడిలో కూర్చోబెట్టుకొని అక్ష‌రాభ్యాసం చేయించారు. పిల్ల‌ల‌కు మేన‌మేమ‌గా ఉంటాన‌ని చెప్పారు. ఇవ‌న్నీ..ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నోట వ‌చ్చిన మాట‌లు. మ‌రి..ఇదే ముఖ్య‌మంత్రికి ఇంత ఘోరం జ‌రుగుతున్నా తెలియ‌లేదా. అధికారులు ఆయ‌న దృష్టికి తీసుకెళ్లలేదా. ఆరోగ్య శాఖా మంత్రికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అయ‌న ఎక్క‌డున్నారు. అనంత‌పురం జిల్లా ప్ర‌భుత్వాసుప‌త్రిలో వంద‌లాది శిశ‌వులు మ‌ర‌ణిస్తున్నా.. ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారు..దీనికి బాధ్యులు ఎవ‌రు..

వంద‌లాది శిశువుల మృత్యువాత‌..

వంద‌లాది శిశువుల మృత్యువాత‌..

అనంత‌పురం ప్ర‌భుత్వాసుప‌త్రిలో శిశువుల మ‌ర‌ణ మృదంగం. న‌వ‌జాత శిశువుల వంద‌ల సంఖ్య‌లో చ‌నిపోతున్నారు. ఇది చాలా రోజులుగా అనంత‌పురం ప్ర‌భుత్వాసుప‌త్రిలో నిత్య‌కృత్యంగా మారింది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ఇదే ర‌కంగా శిశువుల మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు ప‌ది మంది వ‌ర‌కు శిశువులు మ‌ర‌ణించారు. ఆ స‌మ‌యంలో జిల్లా వైసీపీ నేత‌లు ఆస్ప‌త్రి వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. దీనికి అక్క‌డి అధికారులు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు.
పౌష్టికాహార లోపంతో పుట్టిన బిడ్డలు, నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులు దండుకో వడానికి అక్కడే ఉంచుకోవ‌టం.. క్లిష్ట పరిస్థితుల్లో పంపి వేయడం కార‌ణంగా శిశువులు మృత్యు వాత ప‌డుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ, ఇలా అనంత‌పురంలోనే ఎందుకు జ‌రుగుతోందంటే ఇక్క‌డ లోపం ఉన్న‌ట్లు గుర్తించాల్సిన అధికారులు ఏమీ ప‌ట్ట‌న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రించారు.

ఇప్పుడు అదే తీరు ఉన్నా..

ఇప్పుడు అదే తీరు ఉన్నా..


ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లాలోని 14 సీట్ల‌లో వైసీపీకి అక్క‌డి ప్ర‌జ‌లు 12 సీట్లు గెలిపించారు. ప్ర‌త్యేకంగా అనంత‌పురం అర్బ‌న్‌లోనూ వైసీపీనే గెలిచింది. అక్క‌డ సీనియ‌ర్ అనంత వెంక‌ట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొత్త ప్ర‌భుత్వంలో అధికారికంగా ఉత్త‌ర్వులు ఇవ్వ‌న‌ప్ప‌టికీ స్థానిక ఎమ్మెల్యేలే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి అభివృద్ది క‌మిటీ ఛైర్మ‌న్ గా ఉంటార‌ని సీఎం స్ప‌ష్టం చేసారు. అయితే, కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డి ప‌దిహేను రోజులు అయింది. ఇక్క‌డి ప‌రిస్థితో మాత్రం మార్పు రాలేదు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేత‌లు సైతం ఈ శిశువులు మ‌ర‌ణించ‌కుండా అడ్డుకొనేలా ఏం చేయాల‌నే దాని పైన నిపుణుల‌ను సంప్ర‌దించ‌లేదు. గ‌త ప్ర‌భుత్వంలోనూ జ‌రిగాయ‌ని గుర్తు చేయ‌టం మిన‌హా ఇప్పుడు ఎలా నియంత్రించాల‌నే ద ఆని పైన ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్నత స్థాయి స‌మీక్ష లేదు. శిశువుల‌ను వంద‌ల సంఖ్య లో పొగొట్టుకుంటున్న త‌ల్లి తండ్రుల ఆవేద‌న వారికి క‌నిపించటం లేదు.

సీఎంకు తెలియ‌లేదా...ఏం చేస్తున్నారు..

సీఎంకు తెలియ‌లేదా...ఏం చేస్తున్నారు..

ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌గానే జ‌గ‌న్ తొలి సారిగా వైద్య ఆరోగ్య శాఖ మీదే స‌మీక్ష నిర్వ‌హించారు. త‌న ప్రాధాన్య‌త‌ల‌ను వివ‌రించారు. ఈ శాఖ‌కు మంత్రిని కేటాయించినా..తానే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తాన‌ని ప్ర‌క‌టించారు. మ‌రి..ఇటువంటి సున్నిత‌మైన అంశాన్ని..ప‌రిస్థితి చేయి దాటుతున్నా ఈ విష‌యం ముఖ్య‌మంత్రికి తెలియ‌కుండా అధికారులు జాగ్ర‌త్త ప‌డుతున్నారా అనే అనుమానం క‌లుగుతోంది. ఇన్ని రోజులుగా ఈ స‌మ‌స్య ఉంటే ఈ రోజు ఉప ముఖ్య‌మంత్రి హోదాలో వైద్య ఆరోగ్య శాఖ ప‌ర్య‌వేక్షిస్తున్నా ఆళ్ల నాని అనంత‌పురం వ‌స్తున్నార‌ని స‌మాచారం. కానీ, ఈ ప‌రిస్థితి నివార‌ణ‌కు ఏం చేయాల‌నే దాని పైనా ఇప్ప‌టికైనా నిర్ణ‌యం తీసుకుంటారా...లేక ముఖ్య‌మంత్రి వ‌ద్ద స‌మీక్షిస్తామ‌ని దాటేస్తారా అనేది చూడాల్సి ఉంది.

English summary
In Anantapur Govt hospital new born babies dies because of many factors. Govt not concentrating on this sensitive issue. Medical and Health department also neglecting this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X