వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔనా!..ఎపిలో ముఖ్యమంత్రికి..అధికారులు చెప్పనివి..మంత్రులు చెప్పినవి!...ఇవే

|
Google Oneindia TeluguNews

అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు,సమస్యల్లో అనేక విషయాల గురించి కొందరు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పకుండా దాచారా?...అయితే వాటి గురించి మంత్రులు సిఎం కు చెప్పారా?...అంటే అవునంటోంది ఆంధ్ర జ్యోతి పత్రిక. ఈ సన్నివేశం అమరావతిలో జరుగుతున్నకలెక్టర్ల సదస్సు లో రెండో రోజు చోటు చేసుకున్నట్లు ఆ పత్రిక ప్రత్యేక కథనం రాసింది.
వివరాల్లోకి వెళితే...

ఆంధ్ర జ్యోతి కథనం మేరకు...ఆంధ్ర ప్రదేశ్ లో పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?...వివిధ పథకాల అమలులో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి?...వీటి గురించి కలెక్టర్ల సదస్సు సందర్భంగా మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రులు చెప్పిన సమాచారంపై సిఎం కలెక్టర్లు, అధికారుల నుంచి వివరణ అడిగారు.

 ముందుగా...గృహనిర్మాణంపై...

ముందుగా...గృహనిర్మాణంపై...

పేదల గృహనిర్మాణంపై సదస్సులో చర్చ జరుగుతున్న సమయంలో సీఎం అనుమతితో కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ జోక్యం చేసుకుని మాట్లాడారు. గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు రూ.1.50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, రూ.95 వేలే ఇస్తున్నారని, ఉపాధి హామీ పథకం కింద ఇస్తామని చెప్పిన రూ.55వేలు పెండింగ్‌లో పెడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులు సొంతంగా ఇంటి నిర్మాణంలో పాలుపంచుకున్నారని, ఇటుకలు వంటివి సొంతంగా తయారు చేసుకొన్నారని అయితే ఆ వివరాలకు సంబంధించిన ఆధారాలు చూపలేకపోవడంతో నిధులు ఇవ్వలేకపోతున్నామని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు వివరణ ఇచ్చారు.

 అధికారుల మధ్య...వాగ్వాదం...

అధికారుల మధ్య...వాగ్వాదం...

గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద నిధులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్లు ఇటువంటి రికార్డులు ఎప్పటికప్పుడు తయారు చేయించి పనిలో పాల్గొన్నవారితో మస్టర్లు వేయించాలని, అది జరగలేదని ఆయన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ వివరణపై గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఇప్పుడు గృహనిర్మాణ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న కాంతిలాల్‌ దండే జోక్యం చేసుకొని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ రికార్డులు మొత్తం తయారు చేయించామని, అసలు ఎక్కడా చేయించలేదన్న విమర్శ సరికాదన్నారు. ఈ విషయమై అధికారులు పరస్పర విమర్శలకు దిగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో సీఎం జోక్యం చేసుకుని వారిని నిలువరించారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తగదని హితవు పలికారు.

 ఇవ్వాల్సింది...ఎంత? ఇలా రికార్డులు లేని కారణంగా ఇవ్వడం

ఇవ్వాల్సింది...ఎంత? ఇలా రికార్డులు లేని కారణంగా ఇవ్వడం

కుదరని చెప్పిన మొత్తం ఎంత ఉంటుందని సీఎం ప్రశ్నించారు. రూ.49 కోట్లు ఉంటుందని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు తెలిపారు. ఆ మొత్తాన్ని శాఖాపరంగా ఇచ్చేయాలని సీఎం గృహనిర్మాణ శాఖను ఆదేశించారు. "రికార్డుల విషయంలో అప్రమత్తంగా ఉండండి...తప్పులు చేయవద్దు...ఎవరితో వేలెత్తి చూపించుకోవద్దు...వీలు కాకపోతే వదిలివేయండి" అని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

మరో విషయం...పింఛను కోసం...వయసు పెంచుకోవడం

మరో విషయం...పింఛను కోసం...వయసు పెంచుకోవడం

అనంతరం పింఛన్ల మంజూరు అంశం చర్చకు వచ్చినప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరో ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. ‘అరవై ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చే వృద్ధాప్య పింఛను కావాలని నా నియోజకవర్గంలో 2400 దరఖాస్తులు వచ్చాయి. నా లెక్క ప్రకారం అవి 1400కు మించి ఉండే అవకాశం లేదు. నేను సొంతంగా విచారణ చేయిస్తే అందులో వెయ్యి మంది తమ వయసును ఆధార్‌ కార్డులో ఎక్కువ వేయించుకొని దరఖాస్తు చేసుకున్నారని వెల్లడైంది. నా ఒక్క నియోజకవర్గంలోనే వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి ఎన్ని దరఖాస్తులు వచ్చి ఉండాలి?' అంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చారు.

 సెర్ప్‌ సీఈవో...వివరణ ఇవ్వండి:సిఎం

సెర్ప్‌ సీఈవో...వివరణ ఇవ్వండి:సిఎం

ఫించన్ల విషయమై సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ను వివరణ ఇవ్వాలని సీఎం కోరారు. ఆయన స్పందిస్తూ...తమ దృష్టికి రాగానే అలాంటి దరఖాస్తులను నిలిపివేశామని చెప్పారు. అయితే ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తున్నా ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయంటూ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ-ప్రగతి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాంను చూస్తున్న ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసాధికార సర్వేలో సేకరించిన సమాచారం అంతా పీపుల్స్‌ హబ్‌లో పెట్టామని, అందులో ఎవరంటే వారు ఎలా మార్పులు చేస్తారని సీఎం ప్రశ్నించారు.

 ఆధార్‌ కార్డుల వల్లే...అది మన చేతుల్లో లేదు...

ఆధార్‌ కార్డుల వల్లే...అది మన చేతుల్లో లేదు...

ఆధార్ కార్డుల జారీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ యూఐడీఏఐ ఆ మార్పులు చేసిందని, వాటితో తమకు సంబంధం లేదని బాలసుబ్రమణ్యం చెప్పారు. సదస్సులోనే ఉన్న యూఐడీఏఐ చైర్‌పర్సన్‌, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ.. ‘ప్రజలకు సౌకర్యంగా ఉండాలని ఆన్‌లైన్‌ లో ఆధార్‌ కార్డులో జనన తేదీ మార్చుకొనే అవకాశం కల్పించామని, కానీ ఇలా జరిగే అవకాశం ఉందని ఊహించలేదన్నట్లుగా చెప్పారు.

 కానీ...జాగ్రత్త...హెచ్చరించిన సిఎం...

కానీ...జాగ్రత్త...హెచ్చరించిన సిఎం...

ఆధార్ కార్డ్ లో జనన తేదీ మార్పు వెసులుబాటును ఇలా పింఛన్ల కోసం దీనిని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో మూడు నెలల కిందట నిలిపివేశాం. అప్పటి నుంచి ఇలా జరగడం లేదు సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ వివరించారు. ఆధార్‌లో మార్పుచేర్పులు చేసుకొన్న వారి జాబితాను తెప్పించామని, పింఛన్లు ఇచ్చేటప్పుడు వాటిని క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తున్నామని కృష్ణ మోహన్‌ తెలిపారు. కానీ ఈ వివరణపై ముఖ్యమంత్రి సమాధాన పడలేదు. "పీపుల్స్‌ హబ్‌లో మనం పెట్టిన సమాచారంలో ఏవైనా మార్పులు జరిగితే అవి ఎందుకు జరిగాయి...ఎవరు చేశారన్నది స్పష్టత ఉండాలి. ఎవరు పడితే వారు ఆ సమాచారాన్ని మార్చే పరిస్థితి రాకూడదు. జాగ్రత్తగా ఉండండి" అని అధికారులను హెచ్చరించారు.

English summary
In Andhra Pradesh...there are number of things...and conditions in the field...that do not tell the authorities...those issues ministers brought to the attention of the Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X