విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాక్ నుంచి అభినందన్ వస్తే విశాఖ వస్తావా, కనిపిస్తే కొడతావేమో: మోడీపై చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తనపై విమర్శలు చేయడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రధానిపై దుమ్మెత్తిపోశారు. దేశభక్తి గురించి తమకు చెప్పాల్సిన పని లేదన్నారు. ఓ వైపు అభినందన్ పాక్ నుంచి మాతృదేశానికి వస్తుంటే ప్రధాని మోడీ ఇక్కడకు (విశాఖ) వచ్చారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోడీ మోసం చేశారన్నారు.

అభినందన్ వస్తుంటే విశాఖ వచ్చాడు

అభినందన్ వస్తుంటే విశాఖ వచ్చాడు

అభినందన్‌ సురక్షితంగా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. అభినందన్‌ వస్తే ప్రధాని మోడీ స్వాగతం చెప్పలేదని, కానీ సౌదీ అరేబియా కింగ్‌కు మాత్రం ఎదురెళ్లి స్వాగతం చెప్పారని విమర్శించారు. అభినందన్ వస్తుంటే అక్కడకు వెళ్లకుండా విశాఖకు రావడమేనా మోడీ దేశభక్తి అన్నారు. అభినందన్‌ తెగువ, దేశభక్తి అందరికీ ఆదర్శం కావాలన్నారు. మన దేశభక్తిని ఎవరూ శంకించలేరని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యాఖ్యలే బీజేపీ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాజకీయాలను దేశభక్తితో ముడిపెట్ట వద్దన్నారు.

నల్ల జెండాలతో మోడీకి స్వాగతం

నల్ల జెండాలతో మోడీకి స్వాగతం

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మోడీ రాష్ట్రానికి వచ్చారని చంద్రబాబు విమర్శించారు. తమది ధర్మపోరాటమని, నీతి, న్యాయం కోసం పోరాడుతున్నామని, విశ్వసనీయత కోసం బతికిన తనపై నిందలు వేస్తే భరించేది లేదన్నారు. కార్పొరేట్‌ నాయకత్వాన్ని మోడీ ధ్వంసం చేస్తున్నారని, మాట వినకుంటే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. అభినందన్ క్షేమంగా తిరిగొచ్చాడని మనమందరం సంబరంగా ఉంటే ప్రధాని మోడీ మాత్రం విశాఖ వచ్చి నల్లజెండాలతో స్వాగతం అందుకున్నారన్నారు. 57 నెలల పాలనలో మోడీ చేసిందేమీ లేదన్నారు. ఏపీకి మరిన్ని గాయాలను మిగిల్చాడన్నారు.

కనిపిస్తే కొడతారేమే

కనిపిస్తే కొడతారేమే

పుల్వామా ఘటన జరిగితే ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ఓ రాజకీయ సభలో పాల్గొన్నారని, ఆయన తమను విమర్శిస్తారా అని మండిపడ్డారు. కుటుంబ పాలన గురించి మోడీ పదేపదే మాట్లాడుతున్నారని, అసలు ఆయనకు కుటుంబం ఉంటే కదా తెలిసేది అన్నారు. రాజకీయాలను దేశభక్తితో ముడిపెట్టడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి సరికాదన్నారు. యుద్ధం వచ్చింది కాబట్టి ఎన్నికల్లో గెలుస్తామనుకుంటున్నారన్నారు. ప్రధాని చాలాకాలంగా మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అని ఎన్నోసార్లు చెప్పారని, కనీసం వాటిలో ఒక్కటైనా జరిగిందా అన్నారు. ఇలాంటివన్నీ అడుగుతున్నానని ప్రదాని మోడీకి తనపై కోపంగా ఉందని, కనిపిస్తే కొడతారేమో అన్నారు.

English summary
Andhra Pradesh chief minister N Chandrababu Naidu launched a scathing attack on Prime Minister Narendra Modi hours before the latter was to hold an election rally in Visakhapatnam on Friday, accusing him of “betraying” and “cheating” the people of the southern state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X