వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అనిల్ వ‌ర్సెస్ బ‌చ్చ‌య్య : పోల‌వ‌రం పైన సీబీఐ విచార‌ణ త‌ప్పదా

|
Google Oneindia TeluguNews

Recommended Video

పోల‌వ‌రంపై సీబీఐ విచార‌ణకు డిమాండ్ చేసిన వైసీపీ&బీజేపీ |YCP And BJP MP's Demanded For CBI Inspection

పోల‌వ‌రం ప్రాజెక్టులో అవినీతి పైన సీబీఐ విచార‌ణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. అసెంబ్లీలో పోల‌వరం పైన చ‌ర్చ సాగుతున్న స‌మ‌యంలోనే అటు రాజ్య‌స‌భ‌లోనూ ఇదే అంశం పైన చ‌ర్చ‌..ర‌చ్చ సాగింది. పోల‌వ‌రం ప్రాజెక్టు పున‌రావా స ప్యాకేజీ మీద శాస‌న‌స‌భ‌లో ప్ర‌భుత్వం..ప్ర‌తిప‌క్షం మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. త‌మ‌కు ఏదీ ఉంచుకొనే అల వాటు లేద‌ని..టీడీపీకి వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామ‌ని మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అదే స‌మ యంలో వైసీపీ..బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు పోల‌వ‌రం పున‌రావాస ప్యాకేజీ అమ‌ల్లో అవినీతి జ‌రిగింద‌ని.. దీని పైన సీబీఐ విచార‌ణ చేయించాల‌ని రాజ్య‌స‌భ‌లో బీజేపీ..వైసీపీ డిమాండ్ చేసాయి.

 టీడీపీకి వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం..నా వ‌యసు 74 అయినా..

టీడీపీకి వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం..నా వ‌యసు 74 అయినా..

పోల‌వ‌రం ప్రాజెక్టు పేరుతో నాటి టీడీపీ ప్ర‌భుత్వం సొమ్మును దోచేసింద‌ని మంత్రి అనిల్ శాన‌స‌భ‌లో ఆరోపించారు.
కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్‌ కాల్వలు తవ్వకపోతే భూసేకరణకు వేలకోట్ల రూపాయల అదనపు భారం పడేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. పోలవరం దగ్గర ఫొటోలు తీసుకోవటం తప్ప..గత ప్రభుత్వానికి ప్రాజెక్ట్‌ పూర్తి చేద్దామన్న ధ్యాసే లేదని ఎద్దేవా చేశారు. ముంపునకు గురయ్యే లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్ట్‌ వ్యయం అంచనా పెంచు కుంటూ పోవడమే తప్ప.. టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదని విమ‌ర్శించారు. త‌మ‌కు ఏది దాచుకొనే అల‌వాటు లేద‌ని ఏదైనా టీడీపీకి వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామ‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి త‌న‌ వ‌య‌సు గురించి చెబుతూ 74 ఏళ్ల వ‌య‌సు త‌న‌ద‌ని..నీ కంటే యాక్టివ్‌గా ఉంటాన‌ని చెప్పుకొచ్చారు.

 భ‌జ‌న‌..ఫొటోలు త‌ప్పితే ఏమున్నాయి..

భ‌జ‌న‌..ఫొటోలు త‌ప్పితే ఏమున్నాయి..

పోల‌వ‌రం గురించి టీడీపీ స‌భ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి అనిల్ స్పందించారు. ప‌ట్టిసీమ అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్‌..ఇప్పుడు అవే ప‌ట్టిసీమ పంపుల ద్వారా నీరు ఇస్తున్నార‌ని..మ‌రి అవ‌స‌రం లేకుంటే వాటిని తీసేండ‌ని సూచించారు. దీనికి మంత్రి స్పందిస్తూ పోల‌వ‌రం ఖ‌చ్చితంగా చెప్పిన స‌మ‌యానికి పూర్తి చేసి ప‌ట్టి సీమ పంపులు తీసి పారేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామని సవాల్‌ విసిరిన నేతలు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం దగ్గరకు జనాలను తీసుకెళ్లి భజన చేయించుకున్నారని అనిల్ దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైఎస్సేనని, వైఎస్‌ హయాంలో కాలువలు తవ్వకపోయి ఉంటే భూసేకరణకు రూ. వేల కోట్ల భారం పడేదని మంత్రి అనిల్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి కింద తరలించాల్సిందని, నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించార‌ని మంత్రి అనిల్ వివ‌రించారు.

3

ఏపీ అసెంబ్లీలో చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అటు రాజ్య‌స‌భ‌లోనూ ఇదే అంశాన్ని వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి ప్ర‌స్తావించారు. పోల‌వ‌రం పున‌రావాస ప్యాకేజీలో అవినీతి జ‌రిగింద‌ని దీని పైన సీబీఐ విచార‌ణ చేయించే అంశం ప‌రిశీల‌న‌లో ఉందా అని ప్ర‌శ్నించారు. ఇది జాతీయ ప్రాజెక్టు అని..రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్మాణం జ‌రుగు తంద‌ని..అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని కేంద్రం జ‌వాబిచ్చింది. బీజేపీ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహా రావు సైతం ఇదే ప్ర‌శ్న సంధించారు. ప‌న‌రావాసం పేరుతో లెక్క‌లు తారు మారు చేసి అవినీతికి పాల్ప‌డ్డార‌ని దీని పైన సీబీఐ విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేసారు. దీని పైన తాను స్వ‌యంగా ప్ర‌ధానిని క‌లిసి అభ్య‌ర్దిస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో..సీబీఐ విచార‌ణ ద‌శ‌గా ప‌డుతున్న వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లుగా ఈ ప‌రిణామాల‌పైన విశ్లేష‌ణ వినిపిస్తోంది.

English summary
On Polavaram Issue hot discussion taken place in Assembly and also in Rajyasabha. AP Govt stated that the project will be complete in next two years. In Rajyasabha YCP and BJP MP's demanded for CBI investigation in R and R package impleme ntation in Polavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X