వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

|
Google Oneindia TeluguNews

దేశచరిత్రలో కనీవినీ ఎరుగని చర్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపక్రమించారు. ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు ఇస్తోన్న తీర్పులు, స్టే ఉత్తర్వుల వెనుక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం ఉందని, దీనిని సంబంధించి తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని, ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు సీఎం జగన్ ఫిర్యాదు లేఖను అందజేశారు. స్వయంగా వైసీసీ అధికార ప్రతినిధులు, ఏపీ మంత్రులే దీన్నొక సంచలన నిర్ణయంగా అభివర్ణించారు.

చంద్రబాబుకు అవమానం: కేసీఆర్‌కు మోదీ అనూహ్య గిఫ్ట్ - ఇక ఢిల్లీలో కారు చక్రంచంద్రబాబుకు అవమానం: కేసీఆర్‌కు మోదీ అనూహ్య గిఫ్ట్ - ఇక ఢిల్లీలో కారు చక్రం

రమణపై జగన్ యుద్ధం..

రమణపై జగన్ యుద్ధం..

అవును, చదవడానికి ఇబ్బందికరంగా అనిపించినా, ఏపీ సీఎం అసాధారణ చర్యను జాతీయ మీడియా ఇలానే అభివర్ణించింది. సుప్రీంకోర్టులో టాప్-2 జడ్జి, కాబోయే సీజేఐ ఎన్వీ రమణపై జగన్ యుద్ధం ప్రకటించారని దివైర్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర మీడియా సంస్థలు అభివర్ణించాయి. సుప్రీం టాప్ జడ్జిల్లో ఒకరిపై ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తరహాలో ఫిర్యాదు చేయడం, ఏకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రక్రియలో భాగస్వామి అయ్యారని ఆరోపించడం దాదాపు తొలిసారి కావడంతో జాతీయ మీడియా యావత్తూ జగన్-రమణ వార్తలను ప్రముఖంగా ప్రచురించాయి. అంతేకాదు..

మోదీని కలిసిన రోజే..

మోదీని కలిసిన రోజే..

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల పది రోజుల వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. చివరిగా అక్టోబర్ 6న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, సమస్యలపై ఆ భేటీలో చర్చించినట్లు నాడు వార్తలు వచ్చాయి. అయితే, సరిగ్గా అదే రోజు(6న) జగన్.. సీజేఐ బోబ్డేను కలిసి.. జస్టిన్ ఎన్వీ రమణపై ఫిర్యాదు లేఖను కూడా అందించినట్లు ఆలస్యంగా వెల్లడైంది. చంద్రబాబుకు అనుకూలంగా ఏపీ హైకోర్టు వ్యవహరిస్తున్న తీరు, దాని వెనుక జస్టిస్ రమణ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీజేఐకి జగన్ అందించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం శనివారం(10న) రాత్రి మీడియాకు తెలిపారు. అంతేకాదు, జస్టిస్ రమణ గతంలో వెలువరించిన తీర్పులు, ఆయన, ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆస్తుల జాబితాను సైతం జగన్ తన లేఖలో పొందుపర్చడం, వాటిని పబ్లిక్ డొమెయిన్ లో విడుదల చేయడం సంచలనంగా మారింది.

గాలి మరలతో నీరు, ఆక్సిజన్ ఉత్పత్తి - ప్రధాని మోదీ ఐడియాపై దుమారం - రాహుల్ సెటైర్లు -బీజేపీ ఎదురుదాడిగాలి మరలతో నీరు, ఆక్సిజన్ ఉత్పత్తి - ప్రధాని మోదీ ఐడియాపై దుమారం - రాహుల్ సెటైర్లు -బీజేపీ ఎదురుదాడి

జస్టిస్ చలమేశ్వర్, మాజీ ఏజీ దమ్మాలపాటి ప్రస్తావన..

జస్టిస్ చలమేశ్వర్, మాజీ ఏజీ దమ్మాలపాటి ప్రస్తావన..

ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరును ఆక్షేపిస్తూ సీఎం జగన్.. సీజేఐకి మొత్తం ఎనిమిది పేజీలతో కూడిన లేఖ రాశారు. అందులో వివిధ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సైతం ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం బహిర్గతం చేశారు. ఏకంగా పీడీఎఫ్ కాపీలను ఇంటర్నెట్ లో ఉంచారు. జగన్ కు సంబంధించిన ‘సాక్షి' సహా పలు జాతీయ మీడియా సంస్థలు సదరు కాపీలను ప్రచురించాయి. వాటిలో ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ప్రస్తావన ప్రముఖంగా ఉండగా, సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ‘దమ్మలపాటి శ్రీనివాస్ తో కలిసి జస్టిస్ రమణ ఆస్తులు పోగేశారని కూడా జగన్ లేఖలో ప్రస్తావించడం, దానికి ఆధారాలుగా చెబుతోన్న కాపీలను కల్లాం బయటపెట్టడం కలకలం రేపుతున్నది.

కీలక అంశాలివే..

కీలక అంశాలివే..

అజయ్ కల్లాం బహిర్గతం చేసిన ఆధారాల్లో జస్టిస్‌ రమణకు సంబంధించి కీలక ఆరోపణల్లో.. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జడ్జిలుగా ఉన్నవారి నియామకాలు, గతంలో దమ్మలపాటికి అనుకూలంగా వెలువడిన ఉత్తర్వులను ప్రముఖంగా పేర్కొన్నారు. గతంలో జస్టిస్ రమణ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు.. న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌ కు అనుకూలంగా పలు ఉత్తర్వులు ఇచ్చారని, అదే సమయంలో చంద్రబాబుతో జస్టిస్‌ రమణ దగ్గరి సంబంధాలు నెరపారని, గతంలో ఓ ఐదుగురు జడ్జిల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్‌ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం.. అప్పటి సీఎం చంద్రబాబు అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని.. ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ స్వయంగా చెప్పారని కూడా సీఎం జగన్ లేఖలో పేర్కొనడం గమనార్హం. దమ్మలపాటి వాదించిన కేసుల్లో జస్టిస్ రమణ ఇచ్చిన పలు ఉత్తర్వుల వివరాలను సైతం అజయ్ కల్లాం బహిర్గతం చేశారు. అంతేకాదు, అమరావతి భూ కుంభకోణంలో దమ్మలపాటి, జస్టిస్ రమణ కుటుంబీకుల పాత్రకు సంబంధించి సిఐడీ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఏపీ హైకోర్టు గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని కూడా జగన్ తన లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు.

Recommended Video

Ys Jagan కంప్లైంట్ To SC Chief Justice Bobde Against Andhra HC,SC Judge NV Ramana | Oneindia Telugu
జస్టిస్ రమణపై ఫిర్యాదు సరైందేనంటూ..

జస్టిస్ రమణపై ఫిర్యాదు సరైందేనంటూ..

ప్రస్తుతం సుప్రీం జస్టిస్ రమణ ఢిల్లీలో ఉంటూ ఏపీ హైకోర్టును పరోక్షంగా కమాండ్ చేస్తున్నారనే అసాధారణ ఆరోపణను సైతం సీఎం జగన్ తన లేఖలో రాశారు. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ ప్రయోజనాలను నెరవేర్చడమే లక్ష్యంగా.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులిస్తున్నదని పేర్కొన్నారు. కాగా, సీజేఐకి సీఎం లేఖ రాసినట్లు అజయ్ కల్లాం మీడియాకు వెల్లడించిన మరుక్షణం నుంచే వైసీపీ కీలక నేతలు, మంత్రులు జస్టిస్ రమణ పేరును ప్రస్తావిస్తూ బహిరంగ కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం.. జస్టిస్ రమణపై ఫిర్యాదు చేయడం సరైందేనని, ఈ విషయంలో ఎంతవరకైనా వెళతామని చెబుతున్నారు. టీడీపీకి బలమైన జ్యుడీషియల్ లాబీ ఉందంటూ మీడియాలో తరచూ వ్యక్తమయ్యే ఆరోపణల నేపథ్యంలో జగన్ తాజా నిర్ణయం చంద్రబాబు ఆయువుపట్టుపై దాడిగానే భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారంపై జస్టిస్ రమణ, టీడీపీ స్పందించాల్సిఉంది.

English summary
In an unprecedented move, Andhra Pradesh Chief Minister Y S Jagan Mohan Reddy has written to Chief Justice of India S A Bobde, alleging that Justice N V Ramana — next in line to be the CJI — “has been influencing the sittings of the (Andhra Pradesh) High Court including the roster of a few Honourable Judges”. Chief Minister’s eight-page letter refers to Justice Ramana’s alleged “proximity” to TDP leader and former Chief Minister N Chandrababu Naidu, and an Anti-Corruption Bureau investigation into “questionable transactions of land” involving two daughters of Justice Ramana and others in Amaravati, before it was declared the site for the new capital of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X